చిత్తనూర్ లో 75వ రోజుకు చేరిన దీక్షలు

 చిత్తనూర్ లో 75వ రోజుకు చేరిన దీక్షలు

మరికల్, వెలుగు: మండలంలోని చిత్తనూర్​ వద్ద ఇథనాల్​ కంపెనీని రద్దు చేయాలని కోరుతూ బాధితులు చేస్తున్న రిలే దీక్షలు బుధవారం 75వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పాలమూరు​ అధ్యయన వేదిక కో కన్వీనర్​ ఎం.సుదర్శన్​ మాట్లాడుతూ ఇథనాల్​ కంపెనీని రద్దు చేసేంత వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు.

 కంపెనీ రద్దు కోసం మద్దతు తెలపని పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామన్నారు. కంపెనీకి వ్యతిరేకంగా 75 రోజులుగా ఆందోళనలు చేయడం అభినందనీయమన్నారు. లక్ష్మయ్య, ఎం.వెంకట్రాములు, మహదేవ్, రాంచంద్రయ్య పాల్గొన్నారు.