కరోనా నేపథ్యంలో సాంస్కృతిక శాఖ కీలక నిర్ణయం

కరోనా నేపథ్యంలో సాంస్కృతిక శాఖ కీలక నిర్ణయం

కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ సమావేశాలు, ర్యాలీలకు అనుమతులు ఇవ్వడంలేదు. మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేసింది. అదే క్రమంలో రవీంద్ర భారతిలో కూడా కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రవీంద్ర భారతి ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ రద్దు చేసింది. కరోనా జాగ్రత్త చర్యల్లో భాగంగా నిర్ణయం తీసుకున్నట్లు  అధికారులు పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలతోనే మూసివేస్తున్నట్లు తెలిపారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈనెల 10 వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం గతంలోనే నిషేధం విధించింది.

https://twitter.com/DDNewsAndhra/status/1477596005121941504

For More News..

ప్రిన్సిపాల్‌ సహా విద్యార్థులకు కరోనా

టీచర్ల ఇబ్బందులు ప్రభుత్వానికి అర్థం కాకపోవడం దురదృష్టకరం

యాదాద్రికి భారీ విరాళమిచ్చిన హెటిరో