హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఎన్డీయే కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. 6,100 పోస్టులతో వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ ఇవ్వగా, దానిని రద్దు చేస్తూ 16,347 పోస్టులతో మోగా డీఎస్సీకి త్వరలో కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో అధికారంలోకి రాగానే ఏపీ సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీపై సంతకం చేశారు.
కాగా, రాష్ట్ర ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సీఎంను కలిసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నందున ఈ నంబర్ ఏర్పాటు చేశామని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 73062 99999 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు చెప్పాలని కోరారు. ప్రాధాన్యత ప్రకారం సీఎంను కలిసేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.