ఒడిశాలోని ఖరగ్‌పూర్ -భద్రక్ సెక్షన్‌లో ఉన్న బహనాగ బజార్ స్టేషన్‌లో పునరుద్ధరణ పనుల కారణంగా జూన్ 21న హైదరాబాద్, ఒడిశా మధ్య నడిచే పలు రైళ్లు రద్దు అయ్యాయి. వాటిలో షాలిమార్ - హైదరాబాద్ (18045), సికింద్రాబాద్ - షాలిమార్ (12774), హైదరాబాద్ - షాలిమార్ (18046), షాలిమార్ - సికింద్రాబాద్ (12773) ఉన్నాయి.
ట్రాక్ మరమ్మతుల కారణంతో జూన్ 13, 14 తేదీల్లో కూడా 15 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. షెడ్యూల్‌లో మార్పును గమనించి, తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జూన్ 20న బాలాసోర్ రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. బహనాగ బజార్‌లోని స్థానికులతో సమావేశమై పునరుద్ధరణ పనులను సమీక్షించారు.