కాజీపేట నుంచి నడిచే ప్యాసింజర్ రైళ్లపై వర్షాల ఎఫెక్ట్ బాగానే పడింది. అక్కడి నుంచి నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను మరికొన్ని రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వరదలు, మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఈ మార్గంలోని పలు రైళ్లను ఈ నెల 31వరకు రద్దు చేస్తున్నట్లు గతంలో రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వాటి రద్దు డేట్‌ని ఆగస్టు 6 వరకు పొడగించారు.
రద్దైన రైళ్ల వివరాలివి..
కాజీపేట --– డోర్నకల్ : పుష్పుల్(07753/54)
సికింద్రాబాద్– వరంగల్: పుష్పుల్(07462/63)
కాజీపేట – సిర్పూర్కాగజ్నగర్: రామగిరి ఎక్స్‌ప్రెస్(17003/4)
కాజీపేట – బల్లార్షా: బల్లార్షా ఎక్స్‌ప్రెస్(17035 / 36)
భద్రాచలం రోడ్– బల్లర్షా: సింగరేణి ఎక్స్‌ప్రెస్(17033/34)