![మహిళలకు క్యాన్సర్‌పై అవగాహన](https://static.v6velugu.com/uploads/2025/02/cancer-awareness-programme-in-numaish-exhibition_noHSFmLJZA.jpg)
వరల్డ్ క్యాన్సర్ డేను పురస్కరించుకొని ది అబ్స్టెట్రిక్స్, గైనకాలజీ సొసైటీ ఆఫ్ హైదరాబాద్(ఓజీఎస్ హెచ్), ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అబ్స్టెట్రిక్స్, గైనకాలజీ(ఫిగో) , ఫెడరేషన్ ఆఫ్ అబ్స్టెట్రిక్స్, గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఓజీఎస్ఐ) ఆధ్వర్యంలో మంగళవారం నుమాయిష్‌లో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మహిళల్లో క్యాన్సర్వ్యాప్తి, నివారణ, ప్రసూతి మరణాల రేటును తగ్గించడం, మహిళపై అఘాయిత్యాలను అరికట్టడం వంటి అంశాలపై మాట్లాడారు. ఎఫ్ఓజీఎస్ఐ అధ్యక్షురాలు డాక్టర్ శాంతకుమారితోపాటు పలువురు డాక్టర్లను ఎగ్జిబిషన్నిర్వాహకులు సన్మానించారు. కాలేజీ స్టూడెంట్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.