Health alert: నిద్రలేమి సమస్య ఉందా..? క్యాన్సర్,గుండెపోటు వచ్చే ప్రమాదం! మంచి నిద్రకోసం ఇలా చేయండి

Health alert: నిద్రలేమి సమస్య ఉందా..? క్యాన్సర్,గుండెపోటు వచ్చే ప్రమాదం! మంచి నిద్రకోసం ఇలా చేయండి

నిద్రలేమి.. చాలా మందిని వేధిస్తున్న ఆనారోగ్య సమస్య. రాత్రంతా నిద్రపట్టలేదు..గత కొన్ని రోజులుగా నిద్ర సరిపోవడం లేదు..ఇలాంటివి తరుచుగా వింటుంటాం..రాత్రి నిద్ర పట్టలేదంటే మరుసటి రోజు ఉదయం ఆ ప్రభావం కనిపిస్తుంది. ఏపనిపైనా దృష్టి పెట్టలేం..ఈ సమస్య చాలా కాలంగా ఉందంటే మన జీవన శైలి మారిపోతుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందంటున్నారు ఆరోగ్యనిపుణులు. క్యాన్సర్, గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. 

రాత్రివేళ నిద్రపోవడానికి ఇబ్బంది పడడం, రాత్రి సమయంలో తరచుగా మేల్కొవడం లేదా ఉదయాన్నే త్వరగా లేవడం, పగటిపూట అలసటకు గురి కావడం,చిరాకు, నిరాశ లేదా ఆందోళన చెందడం, పనులపై దృష్టి, శ్రద్ధ పెట్టలేకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గడం,శారీరకంగా చురుకుగా ఉండకపోవడం, అన్ని వేళలా నీరసంగా అనిపించడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిద్రలేమి ప్రభావమే గుర్తించాలి. 

తీవ్రమైనఒత్తిడితో కూడిన జీవనశైలిలో ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర చాలా అవసరం. మనం మేల్కొని ఉన్నప్పుడు మెదడు యాక్టివ్ గా ఉంటుంది. అనేక పనులు చేస్తుంది. కానీ నిద్రలో మెదడు కణాలు లయబద్ధమైన తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి మెదడును శుభ్రపరుస్తుంది.

మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు శరీరం స్వయంప్రతిపత్త నాడీ వ్యవస్థ దానిని మరమ్మతు చేయడం ప్రారంభిస్తుంది. నిద్రలో ఈ పనులన్నీ అపస్మారక స్థితిలో జరుగుతాయి. దీనివల్ల శరీరం స్వయంచాలకంగా తిరిగి పనిచేస్తుంది. కాబట్టి ప్రతిరోజూ 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.  

నిద్రసరిపోనపుడు మొదటగా ప్రభావితం అయ్యేది రోగనిరోధక వ్యవస్థ.70శాలం సహజ కిల్లర్ కణాలు తగ్గుతాయి. యాంటీబాడీల ఉత్పత్తి తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. నిద్ర లేకపోవడం ఇన్సులిన్ ఉత్పత్తి  బ్యాలెన్స్ తప్పుతుంది. ఒత్తిడి హార్మోన్లను కూడా పెంచుతుంది. 

తాజా రిపోర్టుల ప్రకారం.. ఆరోగ్యకరమైన వ్యక్తి కొన్ని రోజుల పాటు నిద్ర భంగం కారణంగా ప్రీ-డయాబెటిక్ ,తరువాత డయాబెటిక్ అవుతాడని తెలుస్తుంది. అందుకే ప్రజలు మంచి నిద్ర పొందడానికి ,నిద్ర ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి అవగాహన కల్పించడానికి 'ప్రపంచ నిద్ర దినోత్సవం' జరుపుకుంటారు. మంచి నిద్ర పొందడానికి చిట్కాలు. 

  • నిద్రకు అనుకూలమైన సమయం ,స్థలం ఉండాలి. 
  • నిద్రకు ముందు టీవీ, కంప్యూటర్, మొబైల్ ఫోన్ వంటివి వినియోగించవద్దు
  • నిద్రకు ముందు వ్యాయామం చేయొద్దు. 
  • నిద్రకు ముందు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. 
  • నిద్రలేమి గురించి మీ డాక్టర్ తో సంప్రదించాలి. 
  • మీరు నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే నిద్రలేమి నివారణకు సహాయపడే చికిత్సలను తీసుకోవాలి.