- మూడు క్యాన్సర్ మందుల రేట్లు తగ్గింపు
- కస్టమ్ డ్యూటీ మినహాయించిన కేంద్రం
న్యూఢిల్లీ, వెలుగు: మూడు కీలకమైన క్యానర్ మందులపై ఎంఆర్పీని తగ్గిస్తు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ట్రాస్టూజుమాజ్, ఒసిమెర్టినిబ్, దుర్వాలుమాబ్ ధరలను తగ్గించినట్టు పేర్కొంది. ఈ మేరకు నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైజింగ్ అథారిటీ(ఎన్ పీపీఏ) ఆదేశాలు జారీ చేసిందని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 2024–25 బడ్జెట్ లో పొందుపరిచినట్టు ఈ మూడు మందుల ధరలు తగ్గించామని పేర్కొంది. ఈ మందులపై ఉన్న కస్టమ్ డ్యూటీ చార్జీలను మినహాయిస్తున్నట్టు ఇటీవల కేంద్ర రెవెన్యూ, ఫైనాన్స్ శాఖలు నోటిఫికేషన్ లు జారీ చేశాయని తెలిపింది. వీటిపై ఉన్న జీఎస్టీ రేట్ల స్లాబ్ ను12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించామని గుర్తు చేసింది. తాజాగా తగ్గిన పన్నులు, కస్టమ్ చార్జీల ప్రయోజనాలు వినియోగదారులకు అందేలా ఎంఆర్పీ లో తగ్గింపు ఉండాలని మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలకు ఆదేశాల్లో స్పష్టం చేసింది. రాష్ట్ర డ్రగ్స్ కంట్రోలర్, ప్రభుత్వానికి మారిన ధరల జాబితా ను అందించాలని పేర్కొంది.