- నిమ్స్‌లో ‘క్యాన్సర్ నెక్స్ట్ 2024’ సదస్సు
పంజాగుట్ట, వెలుగు: క్యాన్సర్ వ్యాధి నివారణలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని పలువురు ఆంకాలజీ నిపుణులు పేర్కొన్నారు. మాలిక్యులర్ పాత్ వేస్ నుంచి అడ్వాన్స్డ్ డయాగ్నిస్టిక్స్ వరకు అత్యాధునిక వైద్య చికిత్స అమలవుతుందన్నారు. ఖైరతాబాద్ నిమ్స్ లో సోమవారం క్యాన్సర్నెక్స్ట్ 2024 పేరుతో సదస్సు నిర్వహించారు.
నిమ్స్ డైరెక్టర్ డాక్టర్నగరి బీరప్ప నేతృత్వంలో నిర్వహించిన సదస్సుకు దేశంలోని ప్రముఖ ఆంకాలజీ నిపుణులు, పరిశోధకులు, సంరక్షణ ఆవిష్కర్తలు హాజరయ్యారు.