యాదాద్రి, వెలుగు : క్యాన్సర్ లక్షణాలను ముందే గుర్తించి చికిత్స తీసుకుంటే నయం చేయొచ్చని బీబీనగర్ ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ రమావత్, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి మాధవీలత తెలిపారు. ఈనెల 4న ఇంటర్నేషనల్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా శనివారం భువనగిరి కోర్టు ఆవరణలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ, బీబీనగర్ ఎయిమ్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధి ముందస్తు గుర్తింపు, నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. అనుమానం వస్తే వెంటనే టెస్టులు చేపించుకుని వ్యాధి లక్షణాలు ఉంటే చికిత్స తీసుకోవాలని తెలిపారు. ఆరోగ్యంపై అశ్రద్ధ అనేక నష్టాలకు దారి తీస్తుందన్నారు.
సదస్సులో అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ వినోదిని, డాక్టర్ మానిష్, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ ఉషశ్రీ, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ శ్యాంసుందర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జస్టిస్ కవిత, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు హరినాథ్, న్యాయవాదులు పాల్గొన్నారు.