సాధారణంగా క్యాన్సరు నాలుగు స్టేజీలుగా విభజిస్తారు. మగవాళ్లలో క్యాన్సర్ నిర్ధారణ చేసే స్క్రీనింగ్ పరీక్షలు తక్కువగా ఉన్నాయి. స్క్వామస్ సెల్ కార్సినోమా (చర్మంపై వచ్చే పొలుసు క్యాన్సర్ ) వచ్చిన వాళ్లకి చర్మంపై చిన్న చిన్న పుండ్లు వస్తాయి. ఆ పుండ్లు స్రవించే రక్తాన్ని పరీక్షించి క్యాన్సర్ను నిర్ధారిస్తారు. ఆడవాళ్లలో అయితే కొన్ని పరీక్షల వల్ల క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లో ఉందో లేదో తెలుసుకోవచ్చు. 'పాప్స్మియర్', 'మామోగ్రఫీ' టెస్టుల వల్ల క్యాన్సర్ ఫ్రీ మాలిగ్నెంట్ స్టేజ్ అంటే '0' స్టేజ్ లో ఉందో లేదో తెలుస్తుంది.
'0' స్టేజ్లో ఉంటే జాగ్రత్తలు తీసుకుని నివారించవచ్చు. 'పాప్ స్మియర్' టెస్ట్ 35 సంవత్సరాలు దాటిన మహిళలుచేయించుకుంటే, సర్వైకల్ క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవడం ఈజీ అవుతుందంటారు నిపుణులు. ఈ టెస్ట్ ప్రతి స్త్రీ తన జీవిత కాలంలో కనీసం మూడుసార్లైనా చేయించుకోవాలి. అప్పుడే డాక్టరు క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో నిర్ధారించి ట్రీట్ మెంట్ మొదలుపెడతారు.అలాగే పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి స్త్రీ ప్రతి రెండేళ్లకు ఒక సారి 'మామోగ్రఫీ' చేయించుకుంటే 'బ్రెస్ట్ క్యాన్సర్' వచ్చే సూచనలు ఉన్నాయో, లేదో తెలుస్తుంది.
డిప్రెషన్లోకి వెళ్లొద్దు!
క్యాన్సర్ అని తెలియగానే పేషెంటు డిప్రెషన్లోకి వెళ్లిపోతుంటారు. వాళ్లని మామూలు ప్రపంచంలో తీసుకొచ్చేందుకు చాలా సమయం పడుతుంది. అందుకోసం ఈ మధ్యకాలంలో 'గెలుపు కిరణాలు' అనే పుస్తకాన్ని ప్రచురించాను. దానిలో క్యాన్సర్కి గురైన వాళ్ల బంధువులకు వారితో ఎలా ఉండాలి. వాళ్లు పడిన బాధ అంతా కథ రూపంలో పొందుపరిచాను. హాస్పిటలికి వచ్చే ప్రతి పేషెంట్ కు పుస్తకాన్ని ఇస్తున్నా అంతేకాదు. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలకు, ఇస్కాన్ టెంపుల్స్ వెళ్లి అక్కడి వాళ్లకు క్యాన్సర్ ప్రికాషన్స్ గురించి ఉపన్యాసాలు ఇస్తున్నా.పిల్లలు దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తల్లులకి చెబుతున్నారు డాక్టర్లు.
లెక్కలేం చెబుతున్నయంటే..
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసర్స్ సర్వే ప్రకారం ఏటా 11 లక్షల మంది క్యాన్సర్ బాదిన పడుతున్నారు.
- క్యాన్సర్ నిర్మూలన చేపట్టిన 75 సంవత్సరాలలో మరణాల రేటు 7.84.821.వాళ్లలో పురుషులు: 4,13,519 కాగా, స్త్రీలు: 3,71,302 మంది. అంటే పురుషులు: 9.81% : 9.42%
- ప్రతి ఎనిమిది నిముషాలకు ఒక మహిళ సర్వైకల్ క్యాన్సర్ వల్ల మరణిస్తోంది.
- రోజులో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టు గుర్తిస్తే, ఒకరు ఆ కారణంగా మరణిస్తున్నారు. 0 సంవత్సరానికి 2,500 మంది పొగాకు సంబంధిత
- క్యాన్సర్వ్యాధుల బారిన పడుతున్నారు.
- ధుమపానం కారణంగా 3,17,928 మంది స్త్రీ, పురుషులలో మరణం సంభవిస్తోంది.
- ఊపిరితిత్తులు, ఓరల్ కావిటీ క్యాన్సర్ బారిన పడిన పురుషులు 25 శాతం.
- వైస్ట్ అండ్ ఓరల్ కావిటీ క్యాన్సర్ కి గురైన స్త్రీలు 25 శాతం ఉన్నారు.
- ఓరల్ కావిటీ, లంగ్స్, స్టమక్, కొట్రాక్టల్, ఇసోఫాగస్ క్యాన్సర్ బారిన పడిన స్త్రీ పురుషులు 47.2 శాతం ఉన్నారు.
క్యాన్సర్ ట్రీట్మెంట్:
క్యాన్సర్ అనగానే దానికి ఒక ట్రీట్ మెంట్ ఉంటుందని తెలియకుండా, కచ్చితంగా చనిపోతారనే భ్రమ ఉంది. ఈ భ్రమను వదిలిపెట్టి క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ క్యాన్సర్ లక్షణాలు ఏదైనా కనిపిస్తే, వెంటనే డాక్టర్ను కలిస్తే తేలిపోతుంది. నిజంగానే క్యాన్సర్ వచ్చినా మొదటి స్టేజీలోనే గుర్తిస్తే చిన్న ట్రీట్ మెంట్ తో బయటపడొచ్చు. క్యాన్సర్ ఉందని తెలిసినంత మాత్రాన ఈ జీవితం అయిపోయింది' అని డిప్రెషన్లోకి వెళ్లడంలో అర్థం లేదు.
క్యాన్సరు, దాని తీరునుబట్టి ట్రీట్ మెంట్ ఉంది. మనకు తెలిసిన చాలామంది సెలబ్రిటీలు క్యాన్సర్ బారినపడి ట్రీట్ మెంట్ తీసుకొని, తిరిగి కోలుకున్నవాళ్లు ఉన్నారు. యువరాజ్ సింగ్ గుర్తున్నాడు కదా? క్రికెట్ లో స్టార్ బ్యాట్స్ మేన్ అయిన యువరాజ్ సింగ్ క్యాన్సర్ బారిన పడి, తిరిగి కోలుకొని మళ్లీ క్రికెట్ ఆడాడు కూడా! క్యాన్సర్ ను జయించాలన్న ధైర్యం తెచ్చుకోవడమే దాన్ని పోరాడటానికి కావాల్సిన శక్తి, "వరల్డ్ క్యాన్సర్ ఉద్దేశం కూడా ఇదే!.