ఆ పని చేశారో కర్కాటక రాశి వారు చిక్కుల్లో పడ్డట్లే.. విశ్వావసు నామ సంవత్సరంలో జాతకం ఎలా ఉందంటే..?

ఆ పని చేశారో కర్కాటక రాశి వారు చిక్కుల్లో పడ్డట్లే.. విశ్వావసు నామ సంవత్సరంలో జాతకం ఎలా ఉందంటే..?
  • పునర్వసు 4 పాదము; పుష్యమి 1,2,3,4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు, మీ పేరులో మొదటి అక్షరం హి, హూ, హే, హో, డా, డి, డూ, డే, డో
  • ఆదాయం: 8
  • రాజపూజ్యం: 7
  • వ్యయం : 2
  • అవమానం: 3

గురువు: 30.3.2025 నుండి 14.05.2025 వరకు తామ్రమూర్తిగాను తదుపరి 18.10.2025 వరకు వ్యయంలో రజితమూర్తిగాను తిరిగి 05.12.2025 జన్మయందు తామ్రమూర్తిగాను సంచారము. శని: ఉగాది నుండి మరల ఉగాది వరకు భాగ్యములో రజితమూర్తిగా సంచారము.

రాహుకేతువులు: అష్టమంలో కొన్ని కష్టములు ఇవ్వగలరు. రాహు కేతువుల జపములు వలన శాంతి పొంది మరల ఉగాది వరకు సంచారము.

ఈ రాశి స్త్రీ పురుషులకు కొన్ని విధములుగా మానసిక క్షోభ కలిగినను అనుకూలంగా ఉంటుంది. రైతు సోదరులకు పంటల దిగుబడి బాగ పండగలవు. వృత్తి వ్యాపారస్తులకు సంతృప్తికరంగా ఉండగలరు. డాక్టర్లు, లాయర్లు అమితమైన ఆదాయ వనరులు ఉన్నవి. రాజకీయ నాయకులు స్మాల్​ ఇండస్ట్రీ వారికి బిగ్​ ఇండస్ట్రీ వారి ఆదాయ వనరులు బాగుండగలవు. బంగారం, వెండి వ్యాపారులకు రేటు కంట్రోల్​ లేదు ధర పెరుగును. ఐరన్​ సిమెంట్​ టింబర్​ వ్యాపారులకు అలాగే కిరాణ ఫ్యాన్సీ రంగులు, రసాయనములు సుగంధ ద్రవ్యముల వ్యాపారులకు ఆర్థికంగా గతంలో కన్నా చాలా బాగుంటుంది. 

►ALSO READ | మిథునరాశి రాశి వారికి ఈ ఏడాది పండగే పండగ.. ఊహించని రేంజ్‎లో ఆదాయం

సొంతింటి కల నెరవేరును. గృహమునకు కావలసినవి అమర్చుకొనుటకు అనుకూలమైన రోజులు జాయింట్​ వ్యాపారస్తులకు అభిప్రాయ భేదములు రాగలవు. విద్యార్థులకు పై చదువులలో సీటు సంపాదించగలరు. చిట్స్​ ఫైనాన్స్​ వ్యాపారం అర్థం కాదు. షేర్స్​లో పెట్టుబడి కనిపించదు. ప్రైవేట్​ ఉద్యోగులకు అనేక సమస్యలు, గవర్నమెంట్​ ఉద్యోగులకు ఏసీబీ దాడులు. వాస్తు తప్పులు ఉన్నవారు కేసులలో ఇరుక్కొనగలరు. ట్రాన్స్​ఫర్లు జరుగును. సినిమా రంగం సామాన్యం. టీవీ ఆర్టిస్టులకు సామాన్యంగా ఉంటుంది. పాడి పరిశ్రమ మత్స్య పరిశ్రమ కోళ్ల పరిశ్రమ కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. 

మధ్య మధ్యలో ఆర్థిక ఇబ్బందులు రాగలవు. ప్రతి విషయంలో ఆచితూచి మాట్లాడగలరు. ఎవరికి హామీ ఉన్న మీరు ఆ డబ్బు కట్టవలసి వచ్చును. అన్నదమ్ముల తగాదాలు భార్యాభర్తల మధ్య వివాదములు ప్రతి విషయంలో పంతాలు పట్టింపులు ఎవరు తగ్గరు. ఒకరినొకరు అర్థం చేసుకొనలేరు. తోటివారు తొందరపాటు వలన కష్టనష్టముల మధ్య నలగుట చూసి అయిన ఆర్భాటమునకు ఉద్వాసన చెప్పండి. వివాహములు జరుగును. ఖర్చును పొదుపుగా ఆలోచన చేయండి. మీరు చేయు ప్రయత్నముంలలో ఆటంకములు కలిగినా సరే నిదానముగా ఆ పనులు జరుగును. తొందరపడి ఎవరికి చెప్పరాదు. 

నాగదోషం రాహు కేతువుల దోషమునకు శివాలయం వెనకాల నాగులకు పూజలు చేయండి. గృహ నిర్మాణం విషయంలో వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మాణంలో మంచి ముహూర్తముల కొరకు అడిగి తెలుసుకొని పాటించి ఫలితములు పొందండి. శత్రు బాధలు ఉన్నవి. ఎవరితో గొడవలు పడరాదు. పునర్వసు నక్షత్రం వారు కనక పుష్యరాగం ధరించి దక్షిణామూర్తి పూజలు షిరిడి సాయి దర్శనం చేయండి. పుష్యమి నక్షత్రం వారు ఇంద్ర నీలం ధరించి శనిగ్రహారాధన చేయండి. శనికి తైలాభిషేకం చేయించండి.

ఆశ్లేష నక్షత్రము వారు జాతి పచ్చ చిటికెన వేలుకు ధరించండి. శ్రీ వేంకటేశ్వర స్వామికి చక్కెర పొంగలి ప్రసాదములు సమర్పించండి. బుధవారం వెంకటేశ్వర స్వామివారి అలంకారం చేయండి. మహన్యాస రుద్రాభిషేకం చేయించిన వారికి ఏకాగ్రతతో ఎవరితో ఏవిధంగా మసలుకోవాలి అనేది తెలుసుకుని ముందుకు సాగుటకు ప్రయత్నములు చేయండి. ఓర్పు పట్టుదల అందరితో ఆప్యాయతగా మాట్లాడుట వలన అనేక విధములుగాను సంఘంలో ముందుకు వెళ్లగలరు.

►ALSO READ | వృషభ రాశి వారి జాతకం ఈ ఏడాది ఎలా ఉంది..? ఆదాయం, వ్యయం ఎంతంటే..?

ధ్యానం యోగ ఆక్యుప్రెషర్​ ఆయుర్వేద మందుల ద్వారా ఎంత పెద్ద వ్యాధి వచ్చిన తగ్గుతుంది. ప్రతి విషయంలో పురోగతి ఉన్నది. నిత్య దీపారాధన చేయండి. యాంటి వైబ్రేషన్​ పోతుంది. ప్రతి విషయంలో నమ్మకం విశ్వాసంతో పాటించుటలో మీరు స్వయంగా తెలుసుకొనగలరు. సాధించాలి అనుకుంటే సాధన చేయాలి. అదృష్ట సంఖ్య 2.