బోధన్ గడ్డపై బీజేపీ జెండా ఎగరేస్తాం : వడ్డీ మోహన్ రెడ్డి

నవీపేట్, వెలుగు: బోధన్ గడ్డపై బీజేపీ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండలలోని ఆర్ఆర్ గార్డెన్ లో నవీపేట్, ఎడపల్లి, రెంజల్ మండలాల బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో ఈ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధిస్తామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లు తనకు బీజేపీ టికెట్ ఇప్పించారని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలన్నారు.

2006లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజల అండతో సీఎం కేసీఆర్​ వియ్యంకుడు, ఎమ్మెల్సీ కవిత మామ రాంకిషన్​రావును ఓడించానని గుర్తుచేశారు. బోధన్​లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్నారు. కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో రెంజల్ ఎంపీపీ రజిని, జడ్పీటీసీ విజయ, బీజేపీ రాష్ట్ర నాయకులు అడ్లూరి శ్రీనివాస్, శ్రీధర్, మండలాధ్యక్షులు సరిన్, ఇంద్ర కరణ్, గోపి కృష్ణ పాల్గొన్నారు.