మెదక్: చివరిరోజు నామినేషన్ల జోరు

మెదక్:  చివరిరోజు నామినేషన్ల జోరు

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. చివరిరోజు కావడంతో ఉమ్మడి జిల్లా నుంచి అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. మెదక్ జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలకు మొత్తం33 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో మెదక్ అసెంబ్లీ స్థానానికి 17 మంది, నర్సాపూర్​ అసెంబ్లీ స్థానానికి 16  మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మెదక్ స్థానానికి  బీఆర్ఎస్​ అభ్యర్థిగా ఎం.పద్మ, కాంగ్రెస్​అభ్యర్థిగా మైనంపల్లి రోహిత్​రావు, బీజేపీ అభ్యర్థిగా పంజా విజయ్ కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా అంసాన్​పల్లి లక్ష్మీ, ఎంసీపీఐ అభ్యర్థిగా వనం పుల్లయ్య, అలయెన్స్​ఆఫ్​ డెమోక్రటిక్​రిఫామ్స్​ అభ్యర్థిగా సంతోష్ రెడ్డి

 యుగ తులసి అభ్యర్థిగా చింతల నర్సింలు, ఇండియన్​ బిలీవర్స్​అభ్యర్థిగా బొడ్డు దేవదాస్, బీసీవై అభ్యర్థిగా వనపర్తి రోహిత్, ఇండిపెండెంట్లుగా జి.నాగరాజు, అడ్ల కుమార్, పట్లోళ్ల బాపురెడ్డి, మైనంపల్లి వాణి, లస్మగళ్ల పద్ద, కొమాట స్వామి, జంగంపల్లి రంగగౌడ్, లంబాడి తారియా నామినేషన్లు దాఖలు చేశారు. నర్సాపూర్​ స్థానానికి బీఆర్​ఎస్​ అభ్యర్థిగా వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, కాంగ్రెస్​ అభ్యర్థిగా ఆవుల రాజిరెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మురళీ యాదవ్​, బీఎస్పీ అభ్యర్థిగా కె.నర్సింలు, యుగ తులసి అభ్యర్థిగా పిట్ల నవీన్ కుమార్, భారతీయ చైతన్య యువజన అభ్యర్థిగా గౌరిగారి ఆగమయ్య, ప్రజా బంధు అభ్యర్థిగా జనపాటి నర్సింలు, ఇండిపెండెట్లుగా గొర్రె ప్రవీణ్​రెడ్డి, గాలి అనిల్ కుమార్, చేకుర్తి లక్ష్మారెడ్డి, చీకుల పల్లి నవీన్ కుమార్, దొడ్ల నారాయణరెడ్డి, మాధవి, లకావత్​ రమేశ్, బిడిమట్ట లక్ష్మీ నామినేషన్లు దాఖలు 
చేశారు.  

సంగారెడ్డి జిల్లాలో.. 

జిల్లాలో మొత్తం 71 నామినేషన్లు దాఖలయ్యాయి. సంగారెడ్డిలో 16, పటాన్​చెరులో 18, నారాయణ్​ఖేడ్​లో 12, ఆందోల్ లో12,  జహీరాబాద్ లో 13 నామినేషన్లు దాఖలయ్యాయి. సంగారెడ్డి నుంచి పులిమామిడి రాజు ( బీజేపీ), బి. రాజేశ్వరరావు దేశ్​పాండే(బీజేపీ), శేఖర్ (బహుజన ముక్తి), శరత్ కుమార్ (విద్యార్థుల రాజకీయ పార్టీ), మహమ్మద్ జావేద్ (దేశ్ జన్విత), రామచంద్రయ్య (ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్), మేతరి మనోహర్ (బహుజన రిపబ్లిక్ సోషలిస్ట్), క్యాసారం ప్రవీణ్ కుమార్(బీఎస్పీ), డి. శ్రీనివాస్ ( ధర్మసమాజ్), స్వతంత్ర అభ్యర్థులుగా ఎం. గోపాల్, పోసానిపల్లి బాపురెడ్డి, సత్యనారాయణ నాగసానిపల్లి, నీరడి నర్సింలు, మామ సాహెబ్ జానీ నామినేషన్లు దాఖలు చేశారు.

పటాన్​చెరు నియోజక వర్గం నుంచి గూడెం మహిపాల్​ రెడ్డి (బీఆర్ఎస్​), గూడెం మహిపాల్​రెడ్డి  తరపున ఆయన సతీమణి గూడెం యాదమ్మ, కాట శ్రీనివాస్​గౌడ్​ (కాంగ్రెస్​) ఆయన తరపున ఆయన సతీమణి కాట సుధ,  నీలం మధు (బీఎస్పీ) తంగడపల్లి పద్మారావు (ఇండియా ప్రజాబందు), బీజీఎస్. నారాయణ(భారత చైతన్య యువజన), మల్లికార్జున రావు(సీపీఐఎం), అన్నెల లక్ష్మణ్​(ధర్మసమాజ్), నిఖిల్ గౌడ్​గోకర్​(యుగ తులసీ), నీరుడి వీరస్వామి (పీపుల్స్​ప్రొటెక్షన్),  వర్ధన్​నవీన్​కుమార్​ గౌడ్​( భారతీయ స్వదేశీ కాంగ్రెస్​), అనగళ్ల రాములు(రాష్ట్ర సామాన్య ప్రజ), కె. దానయ్య( మార్క్సిస్ట్​ కమ్యునిస్ట్​ పార్టీ ఆఫ్​ ఇండియా), ఎన్. నర్సింహ్మారెడ్డి (కమ్యూనిస్ట్​పార్టీ ఆఫ్ ఇండియా) లతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

నారాయణ్​ఖేడ్​నుంచి భూపాల్ రెడ్డి(బీఆర్ఎస్) పట్లోళ్ల సంజీవ రెడ్డి(కాంగ్రెస్​), జెనవాడి సంగప్ప(బీజేపీ), మహ్మద్​అల్లావుద్దిన్​ (బీఎస్పీ), సత్తి గోపాల్ రెడ్డి(యుగ తులసి), బి. నర్సింలు(బహుజన్​రిపజ్లికన్​సోషలిస్ట్​పార్టీ), ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. జహీరాబాద్ నుంచి ఎమ్మెల్యే మాణిక్​రావు(బీఆర్ఎస్),  చంద్రశేఖర్ (కాంగ్రెస్​), రాంచందర్​ రాజనర్సింహ్మా(బీజేపీ), జంగం గోపి(బీఎస్పీ) ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఆందోల్ నుంచి బీఆర్​ఎస్​ సిట్టింగ్​ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్​ తరపున 2, కాంగ్రెస్​ అభ్యర్థి దామోదర రాజనర్సింహ్మా తరపున 2 , బీజేపీ అభ్యర్థి బాబుమోహన్​ తరపున 2,  మిగతా ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు.


సిద్దిపేట జిల్లాలో..

జిల్లాలోని  నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి చివరి రోజు మొత్తం 122  నామినేషన్లు దాఖలయ్యాయి.  దుబ్బాక నుంచి 16 నామినేషన్లు దాఖలు కాగా చివరి రోజు మాధవనేని రఘునందన్ రావు---- భారతీయ జనతా పార్టీ ,  ఆది వేణుగోపాల్ యుగ తులసి పార్టీ, ఎల్లా శ్రీనివాస్ రెడ్డి ---భారత చైతన్య యువజన పార్టీ, పెద్ద లింగన్నగారి ప్రసాద్ , చెరుకు శ్రీనివాస్ రెడ్డి  భారత జాతీయ కాంగ్రెస్ ,  వడ్ల మాధవాచారి  బ్లూ ఇండియా పార్టీ , కొత్త ప్రభాకర్ రెడ్డి  భారత రాష్ట్ర సమితి--- 2 సెట్లు,  వేముల వెంకట ప్రసన్న , ఎరుకుల స్వామి,  ముచ్చపతి బయులు అలియన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ

 మహమ్మద్ ఉమర్  స్వతంత్ర అభ్యర్థి --2 సెట్లు,  మాధవరెడ్డి గారి హనుమంత రెడ్డి---- స్వతంత్ర అభ్యర్థి, సలకం రేణుక(పోతారం)---- స్వతంత్ర అభ్యర్థి,  చెరుకు విజయలక్ష్మి  భారత జాతీయ కాంగ్రెస్ నామినేషన్లు దాఖలు చేశారు. సిద్దిపేట నుంచి కొంపల్లి ప్రభుదాస్  రిపబ్లిక్ ఆన్ పార్టీ ఆఫ్ ఇండియా,  వాటారికారి నాగరాణి ఆబాద్ పార్టీ, పిట్ల  శ్రీకాంత్  అలియాన్స్  డెమోక్రటిక్ రి ఫామ్ పార్టీ, ఏదుల నరసింహారెడ్డి  భారత రైతు చైతన్య యువజన పార్టీ, మంద పాండు  బీఎస్పీ,  బైరి నాగ రమణ  ఆబాద్ పార్టీ,  రోమన్ల బాబు ఇండియా ప్రజాబంధు పార్టీ,  దూది శ్రీకాంత్ రెడ్డి బీజేపీ, కర్రోల బాబు  ధర్మ సమాజం పార్టీ, బయ్యారం కమలాకర్ రెడ్డి  యుగతులసి పార్టీ

  గాదగోని చక్రధర్ గౌడ్ బీఎస్పీ, పెద్ద సాయి గారి శ్రీకాంత్ విద్యార్థి నిరుద్యోగుల ప్రజాసంఘాలు,  ఇండిపెండెంట్లుగా పి.శంకర్ , బోయిని సురేశ్,  దాసరి యాదగిరి, ఇరుగ దిండ్ల తిరుపతి,  బాకూరి అశోక్,  పోతుగంటి నరసింహారెడ్డి, కొండ ప్రశాంత్, పిల్లి సాయికుమార్,  మోతుకు సాయి,  రజనీకర్ చాడ, పైసా రామకృష్ణ, బొమ్మల విజయ్,  గువ్వల సంతోశ్ కుమార్ ,  గుమ్మడి శ్రీశైలం,  బొమ్మల ప్రవీణ్ కుమార్, ఏటి ఆంజనేయులు  నామినేషన్లు దాఖలు చేశారు.  హుస్నాబాద్ నుంచి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి  బీజేపీ, పొన్నం ప్రభాకర్  కాంగ్రెస్, అబ్బరబోయిన రాజ్ కుమార్  నవభారత్ నిర్మాణ సేవా పార్టీ,  డుంబాల పరుశరాములు  జై సేవా రాజ్ పార్టీ

 సదన్ మహారాజ్ ధర్మసమాజ్ పార్టీ, బొల్లి సుభాష్ తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ, బదనాపురం శ్రీకాంత్  అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ నేషనల్ పార్టీ, లంక సిరి రాజ్ కుమార్ నేషనల్ నవ క్రాంతి, పెద్దోళ్ల శ్రీనివాస్ బీఎస్పీ, ఇండిపెండెంట్లుగా కాశబోయిన సురేందర్, భూక్య రాజు,  బైరి శ్రీనివాస్, రాగి శ్రీనివాస్ , వడ్లకొండ రవికుమార్ రెడ్డి, అంగేటి సంపత్ రెడ్డి,  కొత్తకొండ నాగరాజు, గద్ద సతీశ్,  బద్దం ప్రవీణ్ రెడ్డి, రాగి శ్రీనివాస్, మరాటి మణిదీప్, అజ్మీరా అనిల్కుమార్, బొడిగె బాలయ్య, సుంకరి సురేశ్, బద్ధం శంకర్రెడ్డి, బొజ్జపురి రాజు, అయిలేని మల్లికార్జునరెడ్డి, జన్నపురెడ్డి సురేందర్రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. గజ్వేల్​నుంచి  భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి తోపాటు మరో 53  మంది ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేశారు.  సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్లో భూ నిర్వాసితులు, ధరణీ సమస్యను ఎదుర్కొంటున్న వారితో పాలు పలు వర్గాలకు చెందిన వారు ఇండిపెండెంట్లు గా నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. 

ALSO READ: బాల్క సుమన్​కు ఓటమి తప్పదు : వివేక్​ వెంకటస్వామి