సివిల్స్‌‌‌‌లో మనోళ్లు..టాప్‌‌‌‌100లో తెలంగాణ నుంచి నలుగురు

సివిల్స్‌‌‌‌లో మనోళ్లు..టాప్‌‌‌‌100లో తెలంగాణ నుంచి నలుగురు
  • ఓరుగల్లు బిడ్డ సాయిశివానికి 11వ ర్యాంక్.. టాప్‌‌‌‌ 100లో తెలంగాణ నుంచి నలుగురు
  • రాజీవ్‌‌‌‌గాంధీ సివిల్స్‌‌‌‌ అభయహస్తం స్కీమ్ లబ్ధిదారుల్లో ఏడుగురికి ర్యాంకులు 
  • తెలంగాణ, ఏపీ నుంచి 50 మందికి పైగా ఎంపిక 
  • సివిల్స్‌‌‌‌ రిజల్ట్ రిలీజ్.. ఆలిండియా టాపర్‌‌‌‌‌‌‌‌ శక్తి దూబే 
  • ఎంపికైన అభ్యర్థులకు రాహుల్, సీఎం రేవంత్ అభినందనలు  

న్యూఢిల్లీ / హైదరాబాద్ / నెట్‌‌‌‌వర్క్, వెలుగు: సివిల్స్‌‌‌‌లో తెలంగాణ, ఏపీ అభ్యర్థులు సత్తా చాటారు. రెండు రాష్ట్రాల నుంచి దాదాపు 50 మందికి పైగా ఎంపికయ్యారు. వరంగల్‌‌‌‌కు చెందిన సాయి శివాని 11వ ర్యాంక్ సాధించి.. తెలుగు రాష్ట్రాల్లో టాపర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. టాప్ 100లో తెలుగు రాష్ర్టాల నుంచి ఐదుగురు ఉండగా, వారిలో నలుగురు తెలంగాణ వాసులే ఉన్నారు.

 ఏపీకి చెందిన బన్న వెంకటేశ్‌‌‌‌15వ ర్యాంక్ సాధించగా.. వరంగల్ జిల్లాకు చెందిన రావుల జయసింహారెడ్డి 46, షాద్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన శ్రావణ్​కుమార్ రెడ్డి 62, ఆదిలాబాద్‌‌‌‌కు చెందిన సాయి చైతన్య జాదవ్ 68వ ర్యాంక్ సాధించారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2024 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. ఆలిండియా టాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు చెందిన శక్తి దూబే నిలవగా.. హర్యానాకు చెందిన హర్షిత గోయల్ రెండో స్థానంలో,  మహారాష్ట్రకు చెందిన డోంగ్రే అర్చిత్ పరాగ్‌‌‌‌‌‌‌‌ మూడో స్థానంలో నిలిచారు. 

మొత్తం 1,009 మంది ఎంపిక

వివిధ సర్వీసుల్లో నియమించేందుకు మొత్తం 1,009 మందిని ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ తెలిపింది. వీరిలో జనరల్ కేటగిరీ నుంచి 335 మంది, ఓబీసీల నుంచి 318 మంది, ఎస్సీల నుంచి 160 మంది, ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌ నుంచి 109 మంది, ఎస్టీల నుంచి 87 మంది చొప్పున ఉన్నట్టు యూపీఎస్సీ వెల్లడించింది. ఎంపికైన క్యాండిడేట్లలో 45 మంది దివ్యాంగులు ఉన్నారని తెలిపింది. 241 మందితో ప్రొవిజనల్ లిస్టు 
రూపొందించగా, ఒక క్యాండిడేట్ రిజల్ట్‌‌‌‌‌‌‌‌ను నిలిపివేసినట్టు పేర్కొంది. అలాగే మరో 230 మంది అభ్యర్థులను రిజర్వ్‌‌‌‌‌‌‌‌ జాబితాలో ఉంచినట్టు చెప్పింది. సివిల్స్‌‌‌‌‌‌‌‌ ఫలితాలను www.upsc.gov.in వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంచామని తెలిపింది. అభ్యర్థులు సాధించిన మార్కుల జాబితాను 15 రోజుల్లోగా వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంచుతామని చెప్పింది.  

సత్తా చాటిన అమ్మాయిలు.. 

సివిల్స్ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. ఈసారి మొదటి రెండు ర్యాంకులను వాళ్లే సొంతం చేసుకున్నారు. టాప్ 5లో ముగ్గురు, టాప్‌‌‌‌‌‌‌‌ 25లో 11 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. టాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచిన శక్తి దూబేది ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని ప్రయాగ్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌. ఆమె యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్‌‌‌‌‌‌‌‌లో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసింది. సివిల్స్‌‌‌‌‌‌‌‌లో పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌‌‌‌‌‌‌‌ను తన ఆప్షనల్ సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌గా ఎంచుకుని సత్తా చాటింది. రెండో ర్యాంక్ సాధించిన హర్షిత గోయల్.. చార్టెడ్ అకౌంటెంట్. హర్యానాలో పుట్టిన ఆమె.. గుజరాత్‌‌‌‌‌‌‌‌లో పెరిగింది. గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని ఎంఎస్ యూనివర్సిటీ ఆఫ్ బరోడాలో బీకామ్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసింది. 

ఈమె కూడా సివిల్స్‌‌‌‌‌‌‌‌లో పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌‌‌‌‌‌‌‌ను తన ఆప్షనల్ సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌గా ఎంచుకుని సత్తా చాటింది. ఇక ఆలిండియా నాలుగో ర్యాంక్ సాధించి టాప్‌‌‌‌‌‌‌‌ 5లో నిలిచిన మరో అమ్మాయి షా మార్గి చిరాగ్. ఈమె అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లోని గుజరాత్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసింది. సివిల్స్‌‌‌‌‌‌‌‌లో సోషియాలజీని తన ఆప్షనల్‌‌‌‌‌‌‌‌ సబ్జెక్టుగా ఎంచుకుని సక్సెస్ అయింది. కాగా, ఆలిండియా థర్డ్ ర్యాంక్ సాధించిన డోంగ్రే అర్చిత్ పరాగ్‌‌‌‌‌‌‌‌ది మహారాష్ట్రలోని పుణె. ఇతను తమిళనాడులోని వీఐటీ నుంచి బీటెక్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేశాడు.

 సివిల్స్‌‌‌‌‌‌‌‌లో ఫిలాసఫీని తన ఆప్షనల్‌‌‌‌‌‌‌‌ సబ్జెక్టుగా ఎంచుకున్నాడు. ఇక ఆలిండియా ఐదో ర్యాంక్ సాధించిన ఆకాశ్ గార్గ్‌‌‌‌‌‌‌‌ ఢిల్లీలోని గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. సివిల్స్‌‌‌‌‌‌‌‌లో సోషియాలజీని తన ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నాడు.  

మొత్తం 1,129 పోస్టులు.. 

2024 ఫిబ్రవరిలో యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ ఇచ్చింది. అదే ఏడాది జూన్ 16న ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించింది. దీనికి 9,92,599 మంది అప్లై చేసుకోగా.. 5,83,213 హాజరయ్యారు. వీరిలో 14,627 మంది మెయిన్స్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించారు. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించగా.. 2,845 ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. ఈ ఏడాది జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 మధ్య ఇంటర్వ్యూలు నిర్వహించి 1,009 మందిని  ఎంపిక చేశారు. కాగా, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ –2024 ద్వారా మొత్తం 1,129 పోస్టులను భర్తీ చేయనున్నట్టు యూపీఎస్సీ తెలిపింది. ఇందులో ఐఏఎస్ 180, ఐఎఫ్ఎస్ 55, ఐపీఎస్ 147, గ్రూప్–ఎ పోస్టులు 605, గ్రూప్–బి పోస్టులు 142 ఉన్నట్టు పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల ర్యాంకులు.. 

పేరు    ర్యాంక్    ప్రాంతం
సాయిశివాని    11    వరంగల్ 
బన్న వెంకటేశ్    15    ఏపీ 
రావుల జయసింహారెడ్డి    46    వరంగల్ 
శ్రావణ్ కుమార్ రెడ్డి    62    షాద్‌‌‌‌‌‌‌‌నగర్ 
సాయి చైతన్య జాదవ్    68    ఆదిలాబాద్ 
ఎన్.చేతనరెడ్డి    110    –  
చెన్నంరెడ్డి శివగణేశ్​ రెడ్డి    119     –
చల్లా పవన్ కల్యాణ్    146    ఏపీ 
ఎన్.శ్రీకాంత్ రెడ్డి     151    –  
నెల్లూరు సాయితేజ     154    – 
కొలిపాక శ్రీకృష్ణసాయి    190    –  
నర్సింశెట్టి చరణ్‌‌‌‌‌‌‌‌ తేజ    231    ఖమ్మం  
హరివరప్రసాద్    255    – 
సాయికిరణ్    298    నాగర్ కర్నూల్ 
రాపర్తి ప్రీతి    451    – 
బానోత్ నాగరాజు    697    ఖమ్మం 
ఇంద్రచిత    739    షాద్‌‌‌‌‌‌‌‌నగర్
తొగరు సూర్యతేజ    799    –
మౌనిమ    920    నల్గొండ
ఆంజనేయులు గోకమల్ల     934    నాగర్ కర్నూల్

సెల్ఫ్‌‌‌‌ ప్రిపరేషన్‌‌‌‌తోనే సత్తా.. 

సివిల్స్‌‌‌‌లో గ్రేటర్ వరంగల్‌‌‌‌కు చెందిన ఇట్టబోయిన సాయిశివాని ఆలిండియా 11వ ర్యాంక్ సాధించింది. కనీసం సొంతిల్లు కూడా లేని  పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. చదువునే నమ్ముకుని ఉన్నత స్థాయికి ఎదిగింది. వ‌‌‌‌రంగ‌‌‌‌ల్ శివనగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ ఇట్టబోయిన రాజ్‌‌‌‌కుమార్,- ర‌‌‌‌జిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. వీరిలో శివాని మొదటి సంతానం. ఈమె కడపలో ట్రిపుల్ ఐటీ పూర్తి చేసింది. ఆపై ఆడపాదడపా కోచింగ్‌‌‌‌కు వెళ్లినా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంట్లోనే సెల్ఫ్ ప్రిపరేషన్‌‌‌‌కు ప్రాధాన్యం ఇచ్చింది. ఇటీవల రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగం సాధించింది. ఇప్పుడు ఏకంగా సివిల్స్‌‌‌‌కు ఎంపికైంది. ‘‘నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. ఎలాగైనా ఐఏఎస్‍ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఒకే టైమ్‌‌‌‌లో గ్రూప్‍ 1, సివిల్స్ ఎగ్జామ్స్ జరిగినప్పటికీ.. రెండింటినీ మేనేజ్ చేసుకుంటూ చదివాను. అనుకున్న లక్ష్యాన్ని సాధించాను” అని సాయిశివాని అన్నారు.   

కానిస్టేబుల్‌‌‌‌ కొడుకు ఐఏఎస్‌‌‌‌ అయ్యిండు.. 

ఆదిలాబాద్​ జిల్లా తలమడుగు మండలం పల్సి-బి తండాకు చెందిన సాయి చైతన్య ఆలిండియా 68వ ర్యాంక్‌‌‌‌ సాధించాడు. ఈయన తండ్రి జాదవ్‌‌‌‌ గోవింద్‌‌‌‌ నిజామాబాద్ జిల్లా డిచ్‌‌‌‌పల్లిలో హెడ్​కానిస్టేబుల్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. తన కొడుకును ఐఏఎస్ చేయాలన్న లక్ష్యంతో సాయి చైతన్యను ప్రోత్సహించాడు. సాయిచైతన్య గత ఐదేండ్లుగా సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. పోయినేడాది ఐఎఫ్ఎస్‌‌‌‌కు సెలక్ట్​ అయ్యాడు. అయినప్పటికీ పట్టువదలకుండా మళ్లీ పరీక్ష రాసి ఈసారి 68వ ర్యాంక్ సాధించాడు. తన కుమారుడు ఎంతో కష్టపడి లక్ష్యాన్ని సాధించాడని జాదవ్ గోవింద్​సంతోషం వ్యక్తం చేశారు. 

తొలి ప్రయత్నంలోనే సక్సెస్.. 

ఆసిఫాబాద్​జిల్లా కౌటల మండలం బోదంపల్లికి చెందిన రైతు బిడ్డ రాంటెంకి సుధాకర్ సివిల్స్ తొలి ప్రయత్నంలోనే ఆలిండియా 949 ర్యాంక్ సాధించాడు. గ్రామానికి చెందిన రైతు సోమయ్య, ప్రమీల- దంపతుల కుమారుడైన సుధాకర్  పదో తరగతి వరకు సిర్పూర్(టి) సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌‌‌‌లో చదువుకున్నాడు. ఇంటర్ హైదరాబాద్‌‌‌‌లోని గౌలిదొడ్డి కాలేజీలో పూర్తి చేశాడు. అనంతరం ఐఐటీ ఖరగ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో డిగ్రీ చేశాడు. గత మూడేండ్లుగా హెచ్‌‌‌‌సీయూలో ఉంటూ సివిల్స్‌‌‌‌కి ప్రిపేర్ అయ్యాడు.  

నాడు ఐపీఎస్.. నేడు ఐఏఎస్ 

హనుమకొండకు రావుల జయసింహా రెడ్డి వరుసగా మూడోసారి సివిల్స్​ర్యాంక్​సాధించాడు. హైదరాబాద్‍ ఐఐటీలో బీటెక్‍ పూర్తి చేసిన జయసింహా.. 2022 సివిల్స్‌‌‌‌లో 217 ర్యాంక్ సాధించి ఐపీఎస్‌‌‌‌కు సెలక్ట్​అయ్యాడు. ఐపీఎస్ ట్రైనింగ్​చేస్తూనే తిరిగి సివిల్స్​రాసి పోయినేడాది 103వ ర్యాంక్​ సాధించాడు. ఐఏఎస్ రాకపోవడంతో పట్టు వదలకుండా మళ్లీ పరీక్ష రాశాడు. ఈసారి 46వ ర్యాంక్‌‌‌‌ సాధించిన జయసింహా ఐఏఎస్‌‌‌‌కు అర్హత సాధించాడు. జయసింహారెడ్డి తండ్రి ఉమ్మారెడ్డి వరంగల్‌‌‌‌లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రీసెర్చ్ అసోసియేట్​డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నారు. 

ఉద్యోగం చేస్తూనే ప్రిపరేషన్.. 

నల్గొండ జిల్లా అనుముల మండలం వీర్లగడ్డ తండాకు చెందిన గిరిజన బిడ్డ దేపావత్ మౌనిమ సివిల్స్‌‌‌‌లో 920వ ర్యాంక్ సాధించింది. హైదరాబాద్‌‌‌‌లో ఇంటర్ వరకు చదివిన మౌనిమ.. ఐఐటీ చెన్నైలో బీటెక్ పూర్తి చేసింది. 2023లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్‌‌‌‌లో ఎంపికై ఆడిట్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా ఉద్యో గం పొందింది. హైదరాబాద్‌‌‌‌లోని అకౌంటెంట్​ జనరల్ ఆఫీసు లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తూనే సివిల్స్‌‌‌‌కు ప్రిపేర్ అయింది. మౌనిమ తండ్రి లచ్చిరాం పబ్లిక్ హెల్త్ డిపార్ట్​మెంట్‌‌‌‌లో పనిచేస్తూ గుండెపోటుతో ఏడాదిన్నర కింద చనిపోయారు. తల్లి సుజాత ప్రభుత్వ టీచర్. తాను ఐఏఎస్ కావాలనేది నాన్న కోరిక అని, ఆయన ప్రోత్సాహంతోనే  సివిల్స్‌‌‌‌లో ర్యాంక్ సాధించానని మౌనిమ అన్నారు. 

మూడో ప్రయత్నంలోలక్ష్యం నెరవేరింది.. 

ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామానికి చెందిన నర్సింశెట్టి చరణ్ తేజ సివిల్స్‌‌‌‌లో 231వ ర్యాంక్ సాధించాడు. చరణతేజ కుటుంబం 25 ఏండ్ల కింద  హైదరాబాద్‌‌‌‌కు వచ్చి స్థిరపడింది. తండ్రి హరినాథ్ బాబు మెకానికల్ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌గా ప్రైవేట్ కంపెనీలో జాబు చేస్తుండగా, తల్లి నాగమణి ఎస్జీటీ టీచర్‌‌‌‌‌‌‌‌గా మెదక్ జిల్లా నర్సాపూర్‌‌‌‌‌‌‌‌లో పని చేస్తున్నారు. ముంబై ఐఐటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన చరణ్ తేజ.. మూడో ప్రయత్నంలో సివిల్స్ సాధించారు.  

ఏడో ప్రయత్నంలో ఎంపిక..  

నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్​జిల్లా వంగూరు మండలం తిప్పరెడ్డిపల్లికి చెందిన గోకమల్ల ఆంజనేయులు ఏడో ప్రయత్నంలో 934వ ర్యాంక్​సాధించాడు. 2015 నుంచి సివిల్స్‌‌‌‌కు ప్రిపేర్​అవుతున్న అతడు.. మూడుసార్లు మెయిన్స్​వరకు వెళ్లాడు. ఇడుపులపాయలోని ఐఐఐటీలో బీటెక్ పూర్తి చేసిన ఆంజనేయులు.. 2017లో ఎస్సీ స్టడీ సర్కిల్‌‌‌‌లో చేరి సివిల్స్ కోచింగ్ తీసుకోవడం ప్రారంభించాడు. ఆర్థికంగా కష్టాలు ఉన్నా, ఫెయిలైన ప్రతిసారీ మానసికంగా కుంగిపోయినా.. వాటిన్నింటినీ దాటుకుంటూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. ఆంజనేయులు తండ్రి శ్రీనివాసులు, తల్లి కృష్ణమ్మ వ్యవసాయ కూలీలు.