
నల్గొండ / సూర్యాపేట/యాదాద్రి : ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు గురువారం నామినేషన్లు వేశారు. ఒక్కొక్కరు మూడు, నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. గురువారం ముహూర్తం బాగుండటంతో అభ్యర్థులు పోటాపోటీ సభలు పెట్టారు.
నల్లగొండలో నామినేషన్లు..
నల్లగొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పిల్లి రామరాజు యాదవ్, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే కూసు కుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి చల్లమల్ల కృష్ణారెడ్డి, నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, బీజేపీ నుంచి కేతావత్ లాలునాయక్, నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్యే నోముల భగత్, కాంగ్రెస్ నుంచి కుందూరు జయవీర్ రెడ్డి, కె. జానారెడ్డి, బీజేపీ నుంచి కంకణాల నివేదితా రెడ్డి, మిర్యాలగూడలో ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావు, కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి, సీపీఎం నుంచి జూలంకంటి రంగారెడ్డి నామినేషన్ వేశారు.
భారీగా తరలివచ్చిన జనం: సూర్యాపేట, నల్గొండ, నకిరేకల్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్యేలు, కాంగ్రె స్ అభ్యర్థులు పోటాపోటీగా జనాన్ని తరలించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి తో పాటు ఇతర అభ్యర్థులు పట్టణాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. నల్గొండలో బీఆర్ఎస్ అసమ్మతి నేత, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ దిగిన పిల్లి రామరాజు పెద్ద ఎత్తున జనాన్ని తరలించారు.
సూర్యాపేట: జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో గురువారం 55మంది అభ్యర్థులు 64 నామినేషన్లు వేశారు. బీఆర్ఎస్ నుంచి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, ముషం రవి కుమార్, బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వర రావు, ధర్మ సమాజ్ పార్టీ నుంచి చెరుకు కిరణ్ కుమార్, మచ్చ వీరకుమారి, బీఎస్పీ నుంచి వట్టే జానయ్య యాదవ్, కోదాడలో కాంగ్రెస్ నుంచి నలమాద పద్మావతి రెడ్డి, జనసేన నుంచి మేకల సతీశ్ రెడ్డి, అల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ నుంచి మల్లెబోయిన ఆంజనేయులు, భారత చైతన్య యువజన పార్టీ నుంచి షేక్ అబ్దుల్ మాలిక్, సీపీఐ(ఎం) నుంచి మత్తెపల్లి సైదులు, హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిలుక కిశోర్ కుమార్, బీఆర్ఎస్ నుంచి శానం పూడి సైది రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పిల్లుట్ల రఘు, బీఎస్పీ నుంచి రాపోలు నవీన్ కుమార్ నామినేషన్ వేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి గాదరి కిషోర్ కుమార్, బీజేపీ నుంచి కడియం రామచంద్రయ్య, ధర్మ సమాజ్ పార్టీ నుంచి దాసరి బాల స్వామి, కాంగ్రెస్ నుంచి భాషాపంగు భాస్కర్, నామినేషన్లు వేశారు.
యాదాద్రి : భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో గురువారం 17 నామినేషన్లు దాఖలయ్యాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రెండు సెట్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్ రెడ్డి మరోసెట్టు దాఖలు చేశారు. సీపీఎం అభ్యర్థి కొండమడుగు నర్సింహా, ధర్మ సమాజ్ పార్టీ నుంచి నల్ల నరేందర్, ఇండిపెండెంట్లు దేవరకొండ నర్సింహాచారి, అవుశెట్టి పాండు, మద్ధూరి మాధవరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఆలేరు అసెంబ్లీకి కాంగ్రెస్ నుంచి బీర్ల అయిలయ్య, బీర్ల అనిత, తెలంగాణ రిపబ్లిక్ పార్టీ నుంచి కందడి మణిపాల్ రెడ్డి, నామినేషన్లు దాఖలు చేశారు.