ప్లీజ్‌‌‌‌.. ఓటేసి పోండి.. ఊరెళ్లిన ఓటర్లకు క్యాండిడేట్ల అభ్యర్థన

  • సంక్రాతికి ఊరెళ్లిన ఓటర్లకు క్యాండిడేట్ల అభ్యర్థన
  • నగరాల్లో ఉన్నోళ్లకు ప్రయాణ ఏర్పాట్లు
  • కొత్త మున్సిపాలిటీల్లో క్యాండిడేట్స్‌‌‌‌ పాట్లు

‘రామగుండంలోని చిరువ్యాపారి సత్యనారాయణ ఇద్దరు కొడుకులు చెన్నైలో చదువుకుంటున్నరు. వారి వార్డులో పోటీ చేస్తున్న ఓ పార్టీ అభ్యర్థి వారిద్దరికి ట్రైన్‌‌‌‌ ఏసీ టైర్‌‌‌‌ వన్‌‌‌‌  టికెట్లు బుక్‌‌‌‌ చేయించారు. వీలు చేసుకుని ఎలాగైనా రావాలని రోజూ ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు’

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  చదువు, ఉద్యోగం కోసం హైదరాబాద్‌‌‌‌, ఇతర నగరాలకు వెళ్లి సంక్రాంతి పండుగకు సొంతూరికొచ్చిన ఓటర్లను ఓటేసి వెళ్లండని మున్సిపల్‌‌‌‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కోరుతున్నారు. లోకల్‌‌‌‌బాడీ ఎన్నికల్లో క్యాండిడేట్ల గెలుపోటములను అతితక్కువ ఓట్లే డిసైడ్‌‌‌‌ చేసే అవకాశం ఉండడంతో ఏ ఒక్క ఓటు మిస్‌‌‌‌ కాకుండా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు.

సరిగ్గా ఏడాది కింద పంచాయతీ ఎన్నికల్లాగే ఈసారి మున్సిపాలిటీ ఎన్నికలు కూడా సంక్రాంతి తర్వాతే వచ్చాయి. హైదరాబాద్‌‌‌‌తోపాటు ఇతర నగరాల్లో పని చేసుకొనే, చదువుకునే అనేక మంది పండుగకు సొంతూళ్లకు పోయింన్రు. వారిలో చాలా మంది రిటన్‌‌‌‌ వచ్చేందుకు రెడీ అవుతుండగా ఆయా వార్డులకు చెందిన అభ్యర్థులు, వారి అనుచరులు ప్రయాణం వాయిదా వేసుకోండని అభ్యర్థిస్తున్నారు. అట్లనే పండుగకు రాలేకపోయిన ఓటర్లకు ఫోన్‌‌‌‌ చేసి ఈ నెల 22న ఓటేసేందుకు రావాలని కోరుతున్నారు. పండుగకు వచ్చి ఉన్నోళ్ల, ఓటేయడానికి సొంతూరుకు వచ్చేటోళ్లకు వారి సంఖ్యను బట్టి వెహికిల్స్‌‌‌‌ ఏర్పాటు చేస్తామని లేదంటే చార్జీలు ఇస్తమని హామీలు ఇస్తున్నారు.

see more news  ఇంట్లో కిచెన్​ బంద్!: బయటి ఫుడ్‌ తెగ తింటున్న జనం