తల్లాడ మండలంలోగ్రూప్ 1, 2, 3 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు సన్మానం

 తల్లాడ మండలంలోగ్రూప్ 1, 2, 3 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు సన్మానం

తల్లాడ, వెలుగు : తల్లాడ మండలంలో ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 1, 2, 3 ఫలితాల్లో సత్తా చాటి ఉద్యోగ అర్హత పొందిన అభ్యర్థులను బుధవారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. చింతా రాహుల్, గోపిశెట్టి సుస్మిత గ్రూప్ 1ఉద్యోగానికి అర్హత సాధించగా, దుగ్గిదేవర వెంకటేశ్వర్లు గ్రూప్ 2, కటిక ఉపేందర్ గ్రూప్ 3 ఉద్యోగం సాధించారు. వీరిని శాలువా తో సత్కరించి పుష్పగుచ్చలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ కృషి, పట్టుదల ఉంటే సాధించిందంటూ ఏమీ లేదన్నారు.