కానిస్టేబుళ్ల నియామకాలను కంప్లీట్ ​చేయాలి

  •     గోదావరిఖనిలో ఎంపికైన అభ్యర్థుల నిరసన 

గోదావ‌రిఖ‌ని, వెలుగు: కానిస్టేబుళ్ల నియామకాల ప్రక్రియను పూర్తిచేయాలని ఎంపికైన అభ్యర్థులు గురువారం గోదావ‌రిఖ‌ని జ‌వహర్‌లాల్ స్టేడియంలో ఫ్లకార్డులు ప‌ట్టుకొని నిర‌స‌న తెలిపారు. 2022లో వెలువడిన కానిస్టేబుల్ నోటిఫికేషన్​నియామకాలు పూర్తి కాలేదని, ఎంపికైన వారికి వెంట‌నే మెడిక‌ల్ టెస్టులు నిర్వహించి.. ట్రెయినింగ్ స్టార్ట్​చేయాలని కోరారు.

ఉద్యోగాలు పొంది ఆరు నెల‌లు గ‌డుస్తున్నా వివిధ కారణాలతో నియామక ప్రక్రియ ముందుకు సాగడం లేదని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,574 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ వేయగా, రామ‌గుండం క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో ప‌లు స‌ర్వీసుల‌కు సంబంధించిన 750 మంది ఉద్యోగాలు సాధించామని తెలిపారు. స‌ర్టిఫికేష‌న్ వెరిఫికేష‌న్ ప్రక్రియ పూర్తయి ఆరు నెల‌లు అవుతోందని చెప్పారు. కాంగ్రెస్​ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రక్రియను పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు. నిరసన తెలిపిన వారిలో అభ్యర్థులు ర‌ఘు, వినోద్‌, వివేక్‌, అజ‌య్‌, రియాజ్‌ త‌దిత‌రులు ఉన్నారు.