ఆ నలుగురిలో కెనడా కొత్త ప్రధాని ఎవరు?

ఆ నలుగురిలో కెనడా కొత్త ప్రధాని ఎవరు?

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కొత్త ప్రధానిగా ఎవరు పగ్గాలు చేపడతారనేదానిపై ఆసక్తి నెలకొంది. కెనడాలో కొత్త ప్రధామనమంత్రి ఎన్నికకు అధికార లిబర్ పార్టీ సిద్దమవుతోంది. ఆదివారం (మార్చి 9) కొత్త ప్రధాని కోసం పార్టీలో ఓటింగ్ నిర్వహించనున్నారు. దాదాపు 1లక్షా40వేల  మంది సభ్యుల ఓటింగ్ తర్వాత లిబరల్ పార్టీ తన కొత్త నాయకుడిని ఈ రాత్రి ప్రకటించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని రేసులో ప్రముఖంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. 

కెనడా ప్రధాని రేసులో ప్రముఖంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో లిబర్ పార్టీకి చెందిన సీనియర్లు మార్క్‌ కార్నీ, క్రిస్టియా ఫ్రీలాండ్‌, కరినా గౌల్డ్‌, ఫ్రాంక్‌ బేలిస్‌లు ఉన్నారు. కార్నీ, ఫ్రీలాండ్‌ల మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పటికీ.. మాజీ బ్యాంకర్‌ అయిన మార్క్‌ కార్నీ కి కొత్త ప్రధానిగా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ?..ఎవరీయన?

59 యేళ్ల మార్క్ కార్నీ మాజీ బ్యాంకర్.. గతంలో కెనడా కేంద్ర బ్యాంకు అధిపతిగా పనిచేశారు. 2008లో ఆర్థిక సంక్షోభం నుంచి కెనడాను గట్టెక్కించారు. అందరి ప్రశంసలు పొందారు. జనవరిలో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటి నుంచి కార్నీ కేబినెట్ మంత్రులు, ఎంపీల మద్దతు ఉంది.  ట్రూడో ప్రభుత్వంలో పనిచేయనప్పటికీ ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ కు అధ్యక్షుడిగా ఉన్నారు. 

ప్రధాని రేసులో ఉన్న మరో వ్యక్తి ఫ్రీలాండ్.. 

కెనడా మాజీ ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి అయిన ఫ్రీలాండ్ కూడా కొత్త ప్రధాని రేసులో ఉన్నారు. ట్రూడో రాజీనామా చేసిన కొద్దిసేపటినుంచే ఆమె పేరు వినిపిస్తోంది.  ట్రూడోతో ఆమెకు మంచి సంబంధాలున్నప్పటికీ ట్రంప్ సుంకాల బెదిరింపు క్రమంలో మార్క్ కార్నీకి అవకాశాలు పెరిగాయి. 56 ఏళ్ల ఫ్రీలాండ్ 2013లో రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు ఉక్రెయిన్, రష్యా లను కవర్ చేసే జర్నలిస్టుగా చాలా ఏళ్లు పనిచేశారు. 

కరీనా గౌల్డ్..

కెనడాలో మంత్రిగా పనిచేసిన అతి పిన్న వయస్కురాలు కరీనా గోల్డ్. ఆమె కెనడాపై ట్రంప్ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించారు. జనవరి 2025 వరకు హౌస్ లీడర్‌గా పనిచేసిన కరీనా గోల్డ్ .. ఆ తర్వాత పార్టీ లీడర్ పదవికి పోటీ చేయడానికి మంత్రివర్గం నుండి వైదొలిగారు.

ఫ్రాంక్ బేలిస్

మాంట్రియల్‌కు చెందిన ఫ్రాంక్ బేలిస్..ఓ వ్యాపారవేత్త 2015 నుంచి 2019 మధ్య లిబరల్ పార్టీ రాజకీయ నేతగా ఉన్నారు. సహజవాయువు రవాణాకోసం అమెరికాపై ఆధారపడకుండా యూరప్, ఆసియాలోని అంతర్జాతీయ మార్కెట్లకు సహజ వాయువును రవాణా చేసే రెండు పైపులైన్లను ఏర్పాటు చేసేందుకు ఫ్రాంక్ బేలిస్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.