గొంతులో ఇరుక్కొని ఊపిరాడక.. నిండు ప్రాణం తీసిన క్యాండీ

గొంతులో ఇరుక్కొని ఊపిరాడక.. నిండు ప్రాణం తీసిన క్యాండీ

చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే లాలీపాప్ నాలుగేళ్ల పిల్లాడి ప్రాణం తీసింది. బాబు గొంతులో క్యాండీ ఇరుక్కొని ఊపిరాడకుండా అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో  4 ఏళ్ల బాబు కన్ను ఆకారంలో ఉండే ఫ్రూటోలా క్యాండీని తిన్నాడు. తియ్యగా, జిగురుగా ఉండే ఆ పదార్థం అతని నోట్లో అతికిపోయింది. వెంటనే బాబు తల్లి దగ్గరికి వెళ్తే ఆమె దాన్ని నీటితో కడిగి, బయటకు తీయడానికి ట్రై చేసింది. ఆ కాండీ నోట్లో నుంచి జారి గొంతులో పడింది. 

గట్టిగా ఉండే ఆ మిఠాయి పిల్లాడి గొంతులో ఇరుక్కుంది. వెంటనే వారు బాబును డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. క్యాండీని తీయడానికి డాక్టర్ చాలాసేపు కష్టపడ్డాడు. అయినా అది బయటకు రాలే. పిల్లాడికి ఊపిరి ఆడక ఉక్కిరబిక్కిరి అయ్యింది. సుమారు మూడు గంటల పాటు పోరాడి బాబు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫ్రూటోలా తయారు చేసిన కంపెనీ దీనికి బాధ్యత వహించాలని బాబు కుటుంబం ఇప్పుడు డిమాండ్ చేస్తోంది.