ఆన్ లైన్ లో గంజాయి బిజినెస్: నిందితుల అరెస్ట్

వరంగల్ జిల్లాలో ఆన్ లైన్ గంజాయ్ వ్యాపారం చేస్తున్న ముఠాని అరెస్ట్ చేశారు పోలీసులు. 30 లక్షల విలువైన 150 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశామన్న సీపీ రవీందర్.. మరో నలుగురు పరారీలో ఉన్నట్టు చెప్పారు. ఈ ముఠా ఎల్కతుర్తి కేంద్రంగా.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా చేసినట్లు తెలిపారు.