కానిస్టేబుల్ ఇంట్లో గంజాయి స్వాధీనం

వరంగల్ జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న గంజాయి దందా గుట్టు రట్టయ్యింది. జిల్లాకు చెందిన రవి అనే కానిస్టేబుల్ ఇంట్లోనే గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నర్సంపేటకు చెందిన యువకులు గంజాయి సేవిస్తుండగా స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుపడిన యువకుల ద్వారా కానిస్టేబుల్ గంజాయి దందా గుర్తించారు యాంటీ డ్రగ్స్ టీమ్ పోలీసులు.

Also Read :- చెన్నైలో భారీ వర్షాలు

గంజాయి దందా నిర్వహిస్తూ పట్టుబడ్డ కానిస్టేబుల్ రవి ప్రస్తుతం నర్సంపేట పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. 
రవి గతంలో పోలీసులకు పట్టుబడ్డ గంజాయి నుండి కొంత తస్కరించి విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. కంచే చేను మేస్తే అన్న చందంగా.. గంజాయిని అరికట్టాల్సిన పోలీస్ వృత్తిలో ఉన్న కానిస్టేబులే గంజాయి విక్రయాలకు ఒడిగట్టడం ప్రస్తుత సమాజంలో దిగజారిన విలువలు, కనుమరుగవుతున్న నైతికతకు నిదర్శనం అని చెప్పాలి.