- ఒకరు అరెస్ట్.. 30 కిలోల సరుకు స్వాధీనం
సికింద్రాబాద్, వెలుగు: ట్రైన్లో ముంబయికి గంజాయి సప్లయ్ చేస్తున్న వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలోని బండి బజార్ ప్రాంతానికి చెందిన మారుఫ్ ఫయాజ్ షేక్(23) కూలీ పనిచేస్తున్నాడు. జల్సాలకు బానిసైన ఫయాజ్ ఈజీ మనీ కోసం గంజాయి సప్లయ్ కి స్కెచ్ వేశాడు. ఈ నెల 3న రూ.6 లక్షల విలువైన 30 కిలోల గంజాయితో ఫయాజ్ ఒడిశా నుంచి ముంబయికి కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరాడు. 4 వ తేదీ ఈ ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అదే టైమ్ లో అక్కడ ఆర్పీఎఫ్, సీఐడీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఫయాజ్ దగ్గరున్న గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఒడిశా నుంచి గంజాయిని ముంబయి, పుణెకు తీసుకెళ్లి అమ్ముతానని ఫయాజ్ విచారణలో చెప్పినట్లు రైల్వే డీఎస్పీ చంద్రబాబు తెలిపారు. నిందితుడిని రిమాండ్ కు తరలించామన్నారు.