రూ.37 లక్షల విలువైన గంజాయి దహనం

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలోని 11 పోలీస్ స్టేషన్లలో నమోదైన 19 కేసుల్లో పట్టుబడ్డ 150 కిలోల గంజాయిని మంగళవారం తలమడుగు మండలం సుంకిడి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో పోలీసులు దహనం చేశారు. దాదాపు రూ.37 లక్షల విలువైన గంజాయిని కాల్చివేసినట్లు ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. కోర్టు అనుమతితో, పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తూ జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దాహనం చేసినట్లు చెప్పారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీలు జీవన్ రెడ్డి, కె.సురేందర్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, సీసీఎస్ ఇన్​స్పెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.