తొలకరి జల్లులు పడగానే విత్తనాలు వేసిన రైతులు ఇప్పుడు వాటిని దక్కించుకునేందుకు అనేక పాట్లు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కర్ర శ్రీనివాస్‌రెడ్డి తనకున్న ఆరు ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశాడు. విత్తనాలు వేసిన తర్వాత వర్షం పడకపోవడంతో అవి మాడిపోతున్నాయి. దీంతో క్యాన్ల ద్వారా నీటిని తీసుకొచ్చి పత్తి విత్తనాలను తడుపుతూ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరికొన్ని రోజులు ఇలాగే వర్షాలు పడకుంటే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది.
- వీణవంక, వెలుగు