కవ్వాల్ టైగర్ జోన్​లో క్యానోపి వాక్​ ప్రారంభం

కవ్వాల్ టైగర్ జోన్​లో క్యానోపి వాక్​ ప్రారంభం

కడెం, వెలుగు: కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ లోని వన్యప్రాణులకు రానున్న వేసవిలో తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని పీసీసీఎఫ్ డోబ్రియాల్ అటవీ అధికారులకు సూచించారు. కడెం మండలంలోని లక్ష్మీపూర్ అటవీ బీట్​లో 50 మీటర్ల పొడవైన క్యానోపి వాక్​ను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం లక్ష్మీపూర్ గ్రాస్ ప్లాంట్​ను పరిశీలించారు. అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అటవీ అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు.

కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్​లో తునికాకు, ఇప్ప పువ్వు సేకరణ నిషేధమన్నారు. అటవీ భూముల ఆక్రమణకు పాల్పడ్డా, వన్యప్రాణులను వేటాడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైసంపేట రాంపూర్, గ్రామస్తుల కోసం కొత్త మద్దిపడగలో నిర్మి స్తున్న పునరావాస ఇండ్లను పరిశీలించి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ఎఫ్​డీపీటీ శాంతారాం, డీఎఫ్ఓ రాంకిషన్ యాదవ్, ఎఫ్ డీఓ భవాని శంకర్, ఎఫ్ఆర్ఓ అనిత, డీఆర్ఓ సిద్ధార్థ, అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.