
తనకు గౌరవం ఇవ్వని చోట ఉండలేనని కాంగ్రెస్‌పై ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరి కిందపడితే వారికి కింద పనిచేయలేనని..తగిన వేదిక ద్వారా కేసీఆర్‌పై పోరాడుతానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ లో జరిగిన సీఎల్పీ సమావేశానికి ఆయన హాజరుకాకుండా తన సొంత నియోజకవర్గం అయిన మునుగోడులో పర్యటించడంతో ఆయన పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి.
తనపై పత్రికల్లో, మీడియాలోనే కాదు.. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయని.. పార్టీ మార్పుపై త్వరలోనే ఓ స్పష్టత ఇస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తనను నమ్మిన వారు తన వెంట రావొచ్చనని వెల్లడించారు.
కాంగ్రెస్ అధిష్టానం తప్పుడు నిర్ణయాలతో పార్టీ బలహీనపడింది
కాంగ్రెస్ అధిష్టానం తప్పుడు నిర్ణయాలతో పార్టీ బలహీనపడిందని.. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడడమే నాకు కావాల్సిందన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎవరు గట్టిగా పోరాడితే ఆ పార్టీలో చేరతానని.. కేసీఆర్ ను గద్దె దింపేందుకు పార్టీ మారతాన్నారు. ఒకవేళ కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడితే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానన్నారు. లేకపోతే మేమే కేసీఆర్ కు ఎదురు నిలబడి పోరాడుతామని వివరించారు.
అందరికీ చెప్పే పార్టీ మారతాం
ప్రజల కోసం త్యాగం చేస్తాంమని, స్వార్థం కోసం పార్టీలు మారమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రజల ఆశీస్సులు తీసుకుని.. అందరికీ చెప్పే పార్టీ మారుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒకర్నొకరు గుంజుకుంటున్నారు.. కాళ్లు పట్టుకుని లాగుతున్నారు.. 75 ఏళ్ల ముసలోళ్లు కూడా ఇంకా నాదే నడవాలంటున్నారు.. మేం గట్టిగా మాట్లాడుతున్నాం.. పోరాడుతున్నాం.. మాకు మంచి పేరుంది.. ఎట్లయినా ఖరాబు చేయాలని మా కాంగ్రెస్ పార్టీ వారితోపాటు.. టీఆర్ఎస్ వారు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పేరుతో డ్యామేజ్ చేసే కుట్ర జరుగుతోందన్నారు. మేము కేసీఆర్ దగ్గరకు కాంట్రాక్టుల కోసం పోతున్నామా..? స్వార్థం కోసం పార్టీ మారతలేం కదా..? అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
పార్టీ నేతల తీరుపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి... సీఎల్పీ సమావేశానికి డుమ్మా
సీఎల్పీలో సోనియా నాయకత్వాన్ని బలపరిచాం