వాట్సాప్లో యూజర్ల ప్రైవసీ కోసం మరో కొత్త అప్డేట్ వచ్చింది. ఇప్పటివరకు వాట్సాప్లో యాడ్ చేసుకోని యూజర్లకు ప్రొఫైల్ ఫొటోలు కనిపించకుండా హైడ్ చేసే ఆప్షన్ ఉంది. అయితే, ఇతరులు మీ ప్రొఫైల్ ఫొటో స్క్రీన్ షాట్ తీయకుండా ఆపడానికి ఎలాంటి ఆప్షన్ లేదు. కానీ, ఇప్పుడు దానికోసం బ్లాకింగ్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ ఫీచర్తో పర్సనల్ ఫొటోలు డౌన్లోడ్ చేసుకోవడం, షేర్ చేయడం వంటివాటిని అడ్డుకోవచ్చు.
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఈమధ్యే వాట్సాప్ బీటా, గూగుల్ ప్లే స్టోర్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. యూజర్లు వేరే వాళ్ల ప్రొఫైల్ ఫొటోను స్క్రీన్ షాట్ చేయడానికి ప్రయత్నిస్తే నోటిఫికేషన్ డిస్ప్లే అవుతుంది. ఆ నోటిఫికేషన్లో యాప్ పరిమితుల కారణంగా స్క్రీన్ షాట్ తీయలేరనే పాప్ అప్ మెసేజ్ వస్తుంది. అయితే, స్ర్కీన్ షాట్ తీయలేకపోయినా, వేరే ఫోన్లో కెమెరాతో ఫొటో తీసుకునే అవకాశం ఉందని గమనించాలి.