కమ్యూనిస్టులు లేకుండా ఖమ్మంలో గెలవలేరు : తమ్మినేని వీరభద్రం

కూసుమంచి, వెలుగు: పార్టీ ఏదైనా కమ్యూనిస్టుల మద్దతు లేకుండా ఖమ్మం జిల్లాలో గెలవడం అసాధ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం తిరుమలాయపాలెం మండలంలో పిండిప్రోలు, హైదర్​సాయిపేట, దమ్మాయిగూడెం, కూసుమంచి మండలంలో గైగోళ్లపల్లి, పోచారం, ముత్యాలగూడెం, చేగోమ్మ, నేలపట్ల, మల్లాయిగూడెంలో ఇటీవల మృతిచెందిన పలువురిని ఆయన పరామర్శించారు. అనంతరం దమ్మాయిగూడెంలో జరిగిన సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన  మాట్లాడారు. బీఆర్ఎస్​తో పొత్తు ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపైన పోరాటాలు చేస్తామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఒక్కరితో కలిసి పని చేస్తామని, ఎన్నిక సమయానికి పొత్తులపై క్లారిటీ వస్తుందన్నారు. పొత్తులు కుదరకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు.