కేటీఆర్​ డ్రామాలను ప్రజలు నమ్మరు : ఎమ్మెల్యే శ్రీగణేశ్

కేటీఆర్​ డ్రామాలను ప్రజలు నమ్మరు : ఎమ్మెల్యే శ్రీగణేశ్
  • పదేండ్లు హైదరాబాద్​ను  గాలికి వదిలేసి ఇప్పుడు కబుర్లు చెప్తున్నడు 

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ వర్కింగ్ ​ప్రెసిడెంట్ కేటీఆర్ డ్రామాలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కంటోన్మెంట్​ ఎమ్మెల్యే శ్రీగణేశ్​ అన్నారు. హైదరాబాద్ నగర సృష్టికర్త కేసీఆర్ అయితే.. తాను నగిషీలుదిద్దానని కేటీఆర్ ఫోజులు కొడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. వినే వాళ్లు అమాయకులైతే హైదరాబాద్ నగరాన్ని కనిపెట్టింది కల్వకుంట్ల కుటుంబం అని చెప్తాడేమో అని ఎద్దేవా చేశారు. 

బుధవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద శ్రీగణేశ్ మాట్లాడారు. కేటీఆర్ పదేండ్లు  హైదరాబాద్​ను గాలికి వదిలేసి ఇప్పుడు తెగ బడాయి కబుర్లు చెప్తున్నారని మండిపడ్డారు. నాలాలు, చెరువులు కబ్జాకు గురైతే పట్టించుకున్న పాపాన పోలేదని, బీఆర్ఎస్​ హయాంలోనే నగరం వరదల్లో మునిగిపోయిందన్నారు. ‘‘రూ.4 వేల కోట్లతో సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్స్ కట్టానని గొప్పలు చెప్పుకుంటున్నావు. నువ్వు మురికి నీళ్లు శుద్ధి చేస్తే మూసీ మురికి కూపంగానే ఎందుకు ఉంది”అని శ్రీగణేశ్ ప్రశ్నించారు.