క్యాపెక్స్​కు 11.21 లక్షల కోట్లు

క్యాపెక్స్​కు 11.21 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: 2025–26 ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్​ ఎక్స్​పెండిచర్​ కోసం రూ.11.21 లక్షల కోట్లు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి క్యాపెక్స్​ కోసం విధించుకున్న టార్గెట్​ను కేంద్రం చేరుకోలేదు. ఈసారి రూ.10.18 లక్షల వరకు ఖర్చవుతాయని అంచనా. 2024లో పలు చోట్ల ఎన్నికలు జరగడం వల్ల 2–3 నెలలు కార్యకలాపాలు జరగలేదని, అందుకే టార్గెట్​ను చేరుకోలేదని మంత్రి వివరణ ఇచ్చారు. 

2024 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం క్యాపెక్స్​ను 10 శాతం పెంచి రూ.10 లక్షల కోట్లకు చేర్చింది. వీటిలో రూ.9.5 లక్షల కోట్ల వరకు ఖర్చవుతాయని భావిస్తున్నారు. ప్రైవేట్ ​ఇన్వెస్ట్​మెంట్లు నెమ్మదించడంతో ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కోసం గత రెండేళ్లలో ప్రభుత్వం క్యాపెక్స్​ను 30 శాతం దాకా పెంచింది. భౌతిక ఆస్తులను కొనుగోలు చేయడానికి క్యాపెక్స్​ను ఉపయోగిస్తారు.