ప్రాపర్టీలపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌‌‌‌ను సవరించాం :నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ప్రాపర్టీలపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌‌‌‌ను సవరించాం :నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తాజాగా బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేసిన లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీసీజీ) ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సవరించామని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. ఇండెక్సేషన్ బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌తో 20 శాతం  లేదా  ఇండెక్సేషన్ బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా తగ్గించిన 12.5 శాతం ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ను ఎంచుకునే అవకాశాన్ని కల్పించాని  తెలిపారు. కాగా, ఈ ఏడాది జూన్ 23కు ముందు కొన్న ప్రాపర్టీలకే ఈ అవకాశం ఉంటుంది. 

పాత ప్రాపర్టీని అమ్మి కొత్త ప్రాపర్టీని కొనుగోలు చేసేవారికి రోలోవర్ బెనిఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉంటుందని సీతారామన్ వివరించారు. రోలోవర్ బెనిఫిట్ కింద పాత ప్రాపర్టీని అమ్మాక వచ్చిన డబ్బుతో నిర్ధిష్టమైన కాల వ్యవధిలో  కొత్త ప్రాపర్టీని కొంటే  క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడదు. కాగా, రియల్ ఎస్టేట్‌‌‌‌పై ఇండెక్సేషన్ బెనిఫిట్స్‌‌‌‌ను తీసేయడంతో ప్రభుత్వంపై విమర్శలు పెరిగియి.