హైదరాబాద్లో క్యాపిటల్ ల్యాండ్ భారీ పెట్టుబడి..రూ.450 కోట్లతో కొత్త ఐటీ పార్క్

  • హైదరాబాద్లో క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ భారీ పెట్టుబడి
  • సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం ఎంవోయూ అడుగుల మేర ఐటీ పార్క్ ఏర్పాటు
  • 1 మిలియన్ చదరపు
  • సింగపూర్ పర్యటనలో సీఎం బిజిబిజీ
  • సాంకేతిక పారిశ్రామిక అభివృద్ధిలో
  • ఇదొక మైలురాయి
  • క్యాపిటల్ల్యాండ్ గ్రూప్ పెట్టుబడి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నం
  • డిజిటల్ మౌలిక సదుపాయాల సింగపూర్ లో  సీఎం రేవంత్ రెడ్డి

సింగపూర్ లో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచ అగ్రగామి సంస్థ క్యాపిటా బ్యాండ్ గ్రూప్ ముందుకొచ్చింది! మిలియన్ చదరపు అడుగులు విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఆసంస్థ ప్రతినిధులతో సీఎం బృందం ఎంవోయూ కుదుర్చుకుంది. ప్రీమియం సౌకర్యాలను కోరుకునే బ్లూచిప్ కంపెనీలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్ ను ఈ కొత్త ప్రాజెక్ట్ తీర్చనుంది. తద్వారా వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి ని మరింత బలోపేతం కానుంది.

క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ పెట్టుబడి నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధిలో ఇదొక మైలురాయిగా అభివర్ణిం చారు. క్యాపిటల్ గ్రూప్ విభిన్నమైన పోర్ట్ ఫోలియో రిటైల్, ఆఫీస్, లాడ్జింగ్, లాజిస్టిక్స్, డేటా సెంటర్లను విస్తరించిందన్నారు.

ALSO READ | రూ.3,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్.. హైదరాబాద్​లోని మీర్​ఖాన్​పేటలో ఏర్పాటు

 హై దరాబాద్ లో అంతర్జాతీయ టెక్ పార్క్ హైద రాబాద్, అవాన్స్ హైదరాబాద్, సైబర్పెర్ల్ అనే మూడు వ్యాపార పార్కులను నిర్వహిస్తోంది. కాగా, క్యాపిటల్ ల్యాండ్ గతంలో ప్రకటించిన 25 ఎండ్యూ ఇట్ లోడ్ డేటా సెంటర్ హైదరాబాద్ లో  2025 మధ్య నాటికి పని చేయడానికి సిద్ధంగా ఉంది. 

ఇది భారతదేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం హైదరాబాద్ కీలకం కానుంది. దీంతో పాటు ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్ (ఐటీపీహెచ్)లో రెండో దశ పునరాభివృద్ధి ఈ ఏడాది స్టార్ట్ అయి.. 2028 నాటికి పూర్తి కానుంది' సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.