విశ్వావసు నామ సంవత్సర మకరరాశి వారి జాతకం.. ఆదాయం, అవమానం, ఖర్చులు ఎలా ఉన్నాయంటే..?

విశ్వావసు నామ సంవత్సర మకరరాశి వారి జాతకం.. ఆదాయం, అవమానం, ఖర్చులు ఎలా ఉన్నాయంటే..?
  • ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు; శ్రవణం 1, 2, 3, 4 పాదములు; ధనిష్ఠ 1, 2 పాదములు. మీ పేరులో మొదటి అక్షరం బో, జా, జి, జూ, జే, జో, ఖా, గా, గీ
  • ఆదాయం : 8
  • రాజపూజ్యం : 4
  • వ్యయం : 14
  • అవమానం : 5

గురువు: 30.03.2025 నుండి 14.05.2025 వరకు సువర్ణమూర్తిగాను 18.10.2025 నుండి లోహమూర్తిగాను తదుపరి 05.12.2025 వరకు సప్తమాన లోహమూర్తిగాను తదుపరి ఉగా వరకు సంచారము. 

శని: ఉగాది నుండి మరల ఉగాది వరకు తృతీయమున రజతమూర్తిగా సంచారము. రాహువు: 18.05.2025  వరకు రజితమూర్తిగా మరల ఉగాది వరకు సువర్ణమూర్తిగా సంచారము. 

కేతువు: ఉగాది నుంచి 18.05.2025 వరకు రజితమూర్తిగాను, తదుపరి సువర్ణమూర్తిగా సంచారము.

ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఉంటుంది. ఆశ నిరాశలకు తావు ఇవ్వకుండా ముందుకు సాగండి. రైతు సోదరులు ముహూర్తబలంతో ధనాదాయ వృత్తి వ్యాపార ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. లాయర్లు, డాక్టర్లు పరిమితికి మించి డబ్బు సంపాదించగలరు. కాంట్రాక్టర్లది పైచేయి రాజకీయ నాయకులు స్వార్థంతో పనిచేసి ప్రజలను మెప్పించగలరు. వెండి, బంగారం, ఇనుము సిమెంట్​ కంకర టింబర్​ వ్యాపారులు లాభదాయకంగా ఉంటారు. ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపారులు కిరణా కెమికల్​ మెడికల్​ వారికి బాగుంటుంది. 

బిగ్​ ఇండస్ట్రీ వారికి చాలా అనుకూలం. స్మాల్​ ఇండస్ట్రీ వారికి చాలా అనుకూలం. స్మాల్​ ఇండస్ట్రీ వారికి బాగుంటుంది. కెమికల్​ బల్క్​, డ్రగ్స్​ ఫార్మా వారికి అనుకూలం. రియల్​ ఎస్టేట్​ బిల్డర్లకు బాగుంటుంది. మత్స్య పరిశ్రమ పాడి పరిశ్రమ ఫౌల్ట్రీ వారికి కొంత వెసులుబాటు కలిగి ఉంటారు. చిట్స్​ షేర్స్​ కష్టనష్టములు పడవలసి వచ్చును. సినిమా వారికి టీవీ ఆర్టీస్టులకు అనుకూలం. ఖర్చులు అధికంగా ఉండగలవు. పరిస్థితులు అర్థం  కావు. చేతివృత్తుల వారికి ధనాదాయం ఉంటుంది. ఎవరైతే చెప్పింది చెప్పినట్లు ఆచరిస్తారో వారికి జనాకర్షణ కలుగుతుంది.

 ఆదాయ వనరులు సమృద్ధిగా ఉండగలవు. కంప్యూటర్​ రంగం వారికి నిరాశ ఉంటుంది. కొన్ని అప్​ అండ్​ డౌన్స్​ ఉంటాయి. మీరు ఎంత డెవలప్​ చేసుకొనిన ఆదాయ వనరులు అధికంగా పొందగలరు. మీ భవిష్యత్​ మీ చేతులలో ఉన్నది. సాధించాలి అనుకొనిన సాధన చేయాలి. సాధన లేకపోతే సాధించలేం. మీరు ఈ సంవత్సరం టార్గెట్​ ప్లాన్​ చేసుకొనిన అసలు మీ గురించి మీకు తెలియాలి కదా మీ పైన మీకు నమ్మకం కలిగితే ధనాదాయం అనర్గలంగా పొందగలరు. చక్కగా ప్లాన్​ చేసుకొనగలరు. ముందు ఇతరులను విమర్శ చేయరాదు. 

మీ లోపాలు మీరు సరిదిద్దుకొనగలిగితే అదృష్టం వరించగలదు. భార్యాభర్తల అన్యోన్యము కొరకు భర్తకు కోపం వస్తే భార్య మంచినీరు నోట్లో పెట్టుకోవాలి. భార్యకు కోపం వస్తే భర్త నోట్లో నీరుపెట్టుకోవాలి. నోటిలో నీరు ఉంటే తగాదా రాదు. ఉత్తరాషాఢ నక్షత్రం వారు జాతి కెంపు ధరించండి. సూర్య నారాయణ ఆరాధన చేయగలరు. శ్రవణం నక్షత్రం వారు జాతి ముత్యం ధరించి దుర్గాదేవికి కుంకుమ పూజ అష్టోత్తర సహస్రనామములు చేయండి. ధనిష్ట నక్షత్రం వారు జాతి పగడం ధరించండి. గోవునకు 450 గ్రా.ల కందులు మంగళవారం ఉదయం దానగా పెట్టండి.

 శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి స్కందగిరిలో అభిషేకం హోమం చేయించండి.  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర గ్రంథములు పంచండి. సంతానం లేనివారికి సంతానం, భార్యాభర్తల గొడవలు తొలగిపోగలవు. వివాహం కానివారికి వివాహం జరుగుతుంది. ధ్యానం యోగ ఆక్యుప్రెషర్​ వలన అనారోగ్యములు రావు. అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణలు చేయించుకొని గత జన్మ దోషాలు తొలగును. ఎవరు ఆచరించగలరో వారికి ఆనందం ఆరోగ్యం ఇది ఎక్కడ అమ్మరు కొనుక్కోవడానికి దొరకదు. అదృష్టసంఖ్య 8.