కెప్టెన్​ ఇన్నింగ్స్​ ఆడిన త్రిష

కెప్టెన్​ ఇన్నింగ్స్​ ఆడిన త్రిష

హైదరాబాద్, వెలుగు: బీసీసీఐ విమెన్స్ అండర్‌‌‌‌‌‌‌‌23 టీ20 ట్రోఫీలో కెప్టెన్​ జి. త్రిష (54 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 63) ఫిఫ్టీతో సత్తా చాటడంతో హైదరాబాద్ జట్టు రెండో విజయం ఖాతాలో వేసుకుంది. కోల్‌‌‌‌కతాలో బుధవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌‌‌‌లో హైదరాబాద్ 22 రన్స్‌‌‌‌ తేడాతో జమ్మూ కాశ్మీర్ జట్టును ఓడించింది.

తొలుత హైదరాబాద్ 20 ఓవర్లలో 125/8 స్కోరు చేసింది. త్రిషతో పాటు ప్రణవి చంద్ర (31) కూడా రాణించింది. ఛేజింగ్‌‌‌‌లో జమ్మూ టీమ్ ఓవర్లన్నీ ఆడి 103/6 స్కోరు మాత్రమే చేసి ఓడింది. హైదరాబాద్ బౌలర్లలో ఇషిత రెండు వికెట్లు పడగొట్టింది.