పట్టు చిక్కింది..రాణించిన హర్మన్‌‌‌‌‌‌‌‌, స్నేహ్‌‌‌‌‌‌‌‌ రాణా

పట్టు చిక్కింది..రాణించిన హర్మన్‌‌‌‌‌‌‌‌, స్నేహ్‌‌‌‌‌‌‌‌ రాణా
  •     రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఆసీస్ 233/5
  •     ఇండియా 406 ఆలౌట్

ముంబై : కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ కౌర్ (2/23) బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఆకట్టుకోవడంతో ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ పట్టు బిగించింది. తొలి రెండు రోజులు ప్రభావం చూపలేకపోయిన ఆస్ట్రేలియా మూడో రోజు గొప్పగా పోరాడినా చివర్లో రెండు వికెట్లు పడగొట్టిన హర్మన్‌‌‌‌‌‌‌‌ ఆతిథ్య జట్టు పైచేయి సాధించేలా చేసింది.  భారీ లోటు స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఆస్ట్రేలియా శనివారం ఆట చివరకు 233/5 స్కోరుతో నిలిచింది. 

మరో రోజు ఆట మిగిలున్న మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 46 పరుగుల ముందంజలో ఉంది. తాలియా మెక్‌‌‌‌‌‌‌‌గ్రాత్ (73) ఫిఫ్టీతో సత్తా చాటగా ఎలైస్‌‌‌‌‌‌‌‌ పెర్రీ (45),  బెత్‌‌‌‌‌‌‌‌ మూనీ (33), అలీసా హీలీ (32) రాణించారు. హర్మన్‌‌‌‌‌‌‌‌, స్నేహ్‌‌‌‌‌‌‌‌ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం అనాబెల్ సదర్లాండ్ (12 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), ఆష్లే గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (7 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. అంతకుముందు  ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 406 రన్స్‌‌‌‌‌‌‌‌ వద్ద ఆలౌటై 187 రన్స్ ఆధిక్యం సాధించింది. ఆసీస్‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలుగు వికెట్లు పడగొట్టింది. ఆదివారమే ఆటకు చివరి రోజు. మిగిలిన ఐదు వికెట్లను తొలి సెషన్‌‌‌‌‌‌‌‌లోనే పడగొట్టి ఆసీస్‌‌‌‌‌‌‌‌ను ఆలౌట్‌‌‌‌‌‌‌‌ చేస్తే ఇండియాకు విజయావకాశాలు పుష్కలంగా ఉంటాయి. 

3 వికెట్లు.. 30 రన్స్

ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 376/7తో ఆట కొనసాగించిన ఇండియా మరో 30 రన్స్‌‌‌‌‌‌‌‌ మాత్రమే రాబట్టి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. మూడో రోజు ఆట మొదలైన  నాలుగో ఓవర్లోనే పూజా వస్త్రాకర్ (47)ను సదర్లాండ్‌‌‌‌‌‌‌‌ పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చింది. స్కోరు 400 దాటిన తర్వాత దీప్తి శర్మ (78).. కిమ్‌‌‌‌‌‌‌‌ గార్త్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో క్లీన్ బౌల్డ్ అయింది. వెంట వెంటనే రెండు ఫోర్లు కొట్టిన రేణుకా సింగ్ (8)ను గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌తో సదర్లాండ్‌‌‌‌‌‌‌‌ ఆఖరి వికెట్‌‌‌‌‌‌‌‌గా ఔట్‌‌‌‌‌‌‌‌ చేసింది.
 
కౌర్ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌

187 రన్స్ లోటుతో రెండో  ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఆసీస్‌‌‌‌‌‌‌‌ మెరుగ్గా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసింది. కొత్త బాల్‌‌‌‌‌‌‌‌తో పేసర్లను మెరుగ్గా ఎదుర్కొన్న ఓపెనర్లు బెత్‌‌‌‌‌‌‌‌ మూనీ, లిచ్​ఫీల్డ్ (18) తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 49 రన్స్ జోడించి మంచి ఆరంభం ఇచ్చారు.  అయితే, ఆఫ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పేహ్‌‌‌‌‌‌‌‌ రాణా వేసిన 12వ ఓవర్లో రిచా ఘోశ్‌‌‌‌‌‌‌‌ సూపర్ ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌తో మూనీని రనౌట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో ఇండియాకు ఫస్ట్ బ్రేక్ లభించింది. తన తర్వాతి ఓవర్లోనే  లిచ్‌‌‌‌‌‌‌‌ఫెల్డ్‌‌‌‌‌‌‌‌ను రాణా బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేసింది. దాంతో ఆసీస్‌‌‌‌‌‌‌‌ 56/2తో నిలిచింది. 

ఈ దశలో సీనియర్లు ఎలైస్‌‌‌‌‌‌‌‌ పెర్రీ,  తాలియా మెక్‌‌‌‌‌‌‌‌గ్రాత్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను ముందుకు తీసుకెళ్లారు. పేస్, స్పిన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో అద్భుతంగా ఆడుతూ స్కోరు వంద దాటించారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని రాణానే విడదీసింది. 43వ ఓవర్లో రాణా స్ట్రెయిట్ ఫుల్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను లెగ్‌‌‌‌‌‌‌‌ సైడ్‌‌‌‌‌‌‌‌ ఆడబోయిన పెర్రీ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 84 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. కానీ, అప్పటికే క్రీజులో కుదురుకున్న గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హీలీతో కలిసి ఆధిపత్యం కొనసాగించింది 156/3తో టీ బ్రేక్‌‌‌‌‌‌‌‌కు వెళ్లొచ్చిన వెంటనే  ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. చివరి సెషన్‌‌‌‌‌‌‌‌లోనూ ఈ ఇద్దరూ ఇండియా బౌలర్లకు సవాల్‌‌‌‌‌‌‌‌ విసిరారు. 

ఈ జోడీని విడదీసేందుకు ఎన్ని మార్పులు చేసినా ఫలితం లేకపోవడంతో కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హర్మన్ స్వయంగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు దిగింది. తన తొలి బాల్‌‌‌‌‌‌‌‌కే మెక్‌‌‌‌‌‌‌‌గ్రాత్‌‌‌‌‌‌‌‌ను ఎల్బీ చేసినా రివ్యూలో ఆసీస్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాటౌట్‌‌‌‌‌‌‌‌గా తేలింది. అయితే కొన్ని బాల్స్ తర్వాత మెక్‌‌‌‌‌‌‌‌గ్రాత్‌‌‌‌‌‌‌‌ను హర్మన్ బౌల్డ్ చేసింది.  దాంతో,  నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 66 రన్స్ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్‌‌‌‌‌‌‌‌ అయింది.  ఆ తర్వాత రాజేశ్వరి బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో వరుస బాల్స్‌‌‌‌‌‌‌‌లో హీలీ ఇచ్చిన క్యాచ్‌‌‌‌‌‌‌‌లను సిల్లీ పాయింట్‌‌‌‌‌‌‌‌లో జెమీమా రోడ్రిగ్స్ డ్రాప్‌‌‌‌‌‌‌‌ చేసింది. చివరకు హర్మన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో హీలీ ఎల్బీ అయింది. సదర్లాండ్‌‌‌‌‌‌‌‌, గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పది ఓవర్ల పాటు క్రీజులో నిలిచి మరో వికెట్ పడకుండా రోజు ముగించారు.

సంక్షిప్త స్కోర్లు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ :  219 ఆలౌట్; 
పట్టు చిక్కింది..రాణించిన హర్మన్‌‌‌‌‌‌‌‌, స్నేహ్‌‌‌‌‌‌‌‌ రాణా  406 ఆలౌట్ (దీప్తి 78, మంధాన 74, గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4/100);
ఆస్ట్రేలియా రెండో ఇనింగ్స్ :  90 ఓవర్లలో 233/5 (తాలియా 73, సదర్లాండ్ 12*, 
గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 7*, హర్మన్ 2/23)