
రాష్ట్రంలో కరోనా బారినపడుతున్న నాయకుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు కరోనా సోకినట్లు తెలిసింది. ఆయనతో పాటు ఆయన సతీమణి సరోజినీ దేవికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిద్దరు ప్రస్తుతం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో లక్ష్మీకాంతరావు కుమారుడు, హుస్నాబాద్ ఎమ్మెల్యే అయిన సతీష్ బాబు కూడా కరోనా బారినపడ్డారు. ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకొని కరోనా నుంచి బయట పడ్డారు.
For More News..