Kenneth Mitchell: ప్రాణాంతకమైన వ్యాధితో కెప్టెన్ మార్వెల్ యాక్టర్ కన్నుమూత

Kenneth Mitchell: ప్రాణాంతకమైన వ్యాధితో  కెప్టెన్ మార్వెల్ యాక్టర్ కన్నుమూత

కెప్టెన్ మార్వెల్, స్టార్ ట్రెక్ సిరీస్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న కెన్నెత్ మిచెల్(Kenneth Mitchell)(49) ఫిబ్రవరి 24న కన్నుమూశారు. తాజాగా ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు.

గత ఐదేళ్లుగా ALS (అమియోట్రొఫిక్ లాటెరల్ స్క్లెరోసిస్) అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న మిచేల్..ఆ వ్యాధితో పోరాడుతూ చనిపోయాడు. ALS అనేది ప్రాణాంతకమైన మోటార్ న్యూరాన్ వ్యాధి.

కెన్నెత్ మిచెల్ 49 ఏళ్ల వయసులోనే మరణించడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు బాధపడుతున్నారు. ఈ మేరకు మిచెల్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంస్టాగ్రామ్లో భావోద్వేగమైన పోస్ట్ చేశారు. "మిచెల్ ఐదున్నర సంవత్సరాలుగా..కెన్ ALS నుండి భయంకరమైన సవాళ్లను ఎదుర్కొన్నాడు. అతను యొక్క నిబద్ధతతో జీవితంలో ప్రతిదీ సాధిస్తూ పైకి ఎదగగలిగాడు, ప్రతి క్షణంలో సంతోషకరమైన జీవితాన్ని గడపగలిగాడు అంటూ పోస్ట్ చేశారు. 

ALSO READ :- నేను పూర్తి బికారిని ఐతున్న..నా ఆస్తులన్నీ కొని సహకరించండి: నళిని

2000 సంవత్సరం నుంచి కెన్నెత్ మిచెల్ సినిమాలు-పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ అభిమానులను సొంతం, చేసుకున్నారు. మిరాకిల్, ఛార్మ్స్ ఫర్ ది ఈజీ లైఫ్, బ్లడ్ హనీ, ఘోస్ట్ విస్పరస్ తదితర చిత్రాల్లో నటించాడు. మిచెల్ ఫ్యామిలీ విషయానికొస్తే 2006లో నటి సుసాన్ మే ప్రాట్‌ని వివాహం చేసుకున్నాడు. మిచెల్ కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.