డిఫరెంట్ కాన్సెప్టుల్లో నటిస్తూ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పాపులారిటీ తెచ్చుకున్నాడు ధనుష్. త్వరలోనే ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. శుక్రవారం ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఉపయోగించిన లూయిస్ మెషిన్ గన్‌ని చేతిలో పట్టుకొని యుద్ధభూమిలో కనిపిస్తున్నాడు ధనుష్.
పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో ఇంటెన్స్‌గా కనిపిస్తున్న ధనుష్ లుక్ ఇంప్రెస్ చేస్తోంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక అరుళ్ మోహన్, నివేదితా సతీష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 1930-40 బ్యాక్‌డ్రాప్‌లో ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతోందని చెప్పారు మేకర్స్. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సినిమాని విడుదల చేయనున్నారు.