ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన పీరియాడిక్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. సంక్రాంతికి తమిళంలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. శుక్రవారం తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహ న్ మాట్లాడుతూ ‘ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉంటుంది. 1930–40 బ్యాక్‌డ్రాప్ స్టోరీ కావడంతో ప్రేక్షకులకు ఫ్రెష్‌గా కనిపిస్తుంది. కథతో పాటు క్యారెక్టర్స్, కాస్ట్యూమ్స్ డిఫ రెంట్ స్టయిల్‌లో ఉంటాయి.
నా క్యారెక్టరైజేషన్ విషయంలో దర్శకుడు అరుణ్ విజన్‌ని ఫాలో అయ్యా. ధనుష్‌తో పాటు శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ లాంటి స్టార్స్ ఉన్న చిత్రంలో పార్ట్ కావడం ఆనందంగా ఉంది. తమిళంలో పాజిటివ్ టాక్ వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కూడా కచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నా. కథ, యాక్షన్, ఎమోషన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుం టాయి. ఇక ప్రస్తుతం తెలుగులో నానితో కలిసి ‘సరిపోదా శనివారం’ చిత్రంలో నటిస్తున్నా. షూటింగ్ జరుగుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ’ చిత్రం చేస్తున్నా’ అని చెప్పింది.