
దుబాయ్: వరుసగా రెండు భారీ విజయాలతో చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ చేరుకున్న టీమిండియా తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పలు మార్పులతో బరిలోకి దిగనుంది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే ఈ పోరులో కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అతని స్థానంలో రిషబ్ పంత్ జట్టులోకి వచ్చే చాన్స్ ఉండగా.. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ చేపడతాడని తెలుస్తోంది.
పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా కాలి కండరాలు పట్టేయడంతో రోహిత్ ఇబ్బందిపడ్డాడు. కొద్దిసేపు ఫీల్డింగ్‌కు దూరమయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే, ఇప్పటికే సెమీస్ చేరడంతో కివీస్‌తో పోరులో అతనికి విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే రోహిత్ ప్లేస్‌లో రిషబ్ పంత్ తుది జట్టులోకి రానున్నాడు. అప్పుడు గిల్‌తో కలిసి రాహుల్ ఓపెనర్‌గా వచ్చే చాన్సుంది.