టీ20 వరల్డ్ కప్ సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఓడిపోవడంపై కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీరు పెట్టుకున్నాడు. ఎన్నో ఆశలతో ఆస్ట్రేలియా వెళ్లిన రోహిత్ శర్మ..సెమీస్లోనే ఇంటిముఖం పట్టడంపై తట్టుకోలేకపోయాడు. మ్యాచ్ ముగిశాక దుఖం:తో ఉండిపోయాడు. అయితే రోహిత్ శర్మను కోచ్ ద్రవిడ్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. అటు గ్రౌండ్లో కోహ్లీ సైతం నిరాశలో కూరుకుపోయాడు.
ఒత్తిడిని జయించలేకపోయాం..
ఇంగ్లాండ్ చేతిలో ఓడటానికి బౌలర్ల ప్రదర్శనే కారణమని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఓటమితో తీవ్ర నిరాశకు లోనైనట్లు చెప్పాడు. బ్యాటింగ్ బాగానే చేసినా..బౌలింగ్లో రాణించలేకపోయామన్నాడు. నాకౌట్ మ్యాచ్‌లలో ఒత్తిడిని అధిగమించాలని..అయితే ఈ మ్యాచ్లో ఒత్తిడి జయించలేకపోయామన్నాడు. టీమిండియా ఆటగాళ్లకు ఇలాంటి మ్యాచ్‌లు కొత్తకావడన్నాడు. ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడినవాళ్లేనని..వారంతా ఒత్తిడిని జయించినవారే అని తెలిపాడు.
ప్రణాళికలను అమలు చేయలేదు..
ఈ విజయం క్రెడిట్ ఇంగ్లా్ండ్ ఓపెనర్లకే దక్కుతుందని రోహిత్ శర్మ అన్నాడు. బట్లర్, హేల్స్ అద్భుతంగా ఆడారని కొనియాడాడు. ఇన్నింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచే దూకుడు ప్రదర్శించారని మెచ్చుకున్నాడు. అయితే తాము మాత్రం స్థాయికి తగ్గట్లు ఆడలేదన్నాడు. ముందుగా అనుకున్న ప్లాన్ను సరిగా అమలు చేయలేకపోయామని చెప్పాడు.