ముంబై : ఐపీఎల్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బ్యాడ్ న్యూస్. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు మళ్లీ వెన్ను నొప్పి తిరగబెట్టినట్లు తెలుస్తోంది. దీంతో అతను ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రంజీ ఫైనల్లో నొప్పి కారణంగా శ్రేయస్ ఐదో రోజు గ్రౌండ్‌లోకి రాలేదు.
రెస్ట్ తీసుకున్నా నొప్పి తగ్గకపోవడంతో శనివారం డాక్టర్లను కలవనున్నాడు. మూడో రోజు ఆటలోనూ శ్రేయస్ రెండుసార్లు గ్రౌండ్‌లోనే చికిత్స తీసుకున్నాడు. ‘శ్రేయస్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అతనికి కొన్నాళ్లు రెస్ట్ అవసరమని భావిస్తున్నారు. డాక్టర్లు దీన్ని నిర్ధారిస్తారు. వైద్యుల సలహా తర్వాతే ఐపీఎల్‌పై నిర్ణయం ఉంటుంది’ అని క్రికెటర్ వర్గాలు తెలిపాయి.