కారు యాక్సిడెంట్.. పోలీసులకు బంగారం అప్పగించిన 108 సిబ్బంది

పెద్దపల్లి జిల్లా : రామగుండంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రామగుండం మండలం మల్యాలపల్లి రైల్వే బ్రిడ్జి  మూలమలుపు దగ్గర కారు బోల్తా పడి…. ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఘటనలో గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కరీంనగర్ హాస్పిటల్ తరలించారు. కారులో బంగారం స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న వారిని బంగారు నగలు తయారుచేసే వ్యాపారులుగా గుర్తించారు. ఆర్డర్ పై మంచిర్యాల, బెల్లంపల్లి షాపులకు బంగారు ఆభరణాలను తయారు చేసి ఇస్తుంటారని చెప్తున్నారు పోలీసులు. ఘటనా స్థలంలో బంగారాన్ని గుర్తించి పోలీసులకు అప్పగించారు 108 సిబ్బంది.