
హైదరబాద్ లో అతివేగంతో ఓ కారు బీభత్సం సృష్టించింది. శంకర్ పల్లి నుంచి నార్సింగి వెళ్తున్న కారు అదుపుతప్పి అడ్వర్టైజింగ్ పిల్లర్ ను ఢీకొట్టింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గండిపేట్ సీబీఐటీ కాలేజ్ వద్ద అడ్వర్టిసింగ్ పిల్లర్ ను ఢీ కొట్టడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది.
అతివేగంతో పిల్లర్ ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అక్కడున్న స్థానికులు విద్యార్థులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ALSO READ | వామ్మో.. ఆ ఫుడ్ మాకొద్దు! సెక్రటేరియెట్కు సప్లై చేస్తున్న ప్రొటోకాల్ ఫుడ్లో నో క్వాలిటీ
సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు నార్సింగి పోలీసులు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు మొదలుపెట్టారు. ఓవర్ స్పీడే ఈ ఘటనకు కారణమని తెలిపారు.