హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. తిప్పలు పడుతున్న ప్రయాణికులు

హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. తిప్పలు పడుతున్న ప్రయాణికులు

పెద్ద అంబర్ పేట్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు నానా తిప్పలు పడ్డారు. పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగురోడ్డు వద్ద కారు బీభత్సం సృష్టించిన ఘటనే ట్రాఫిక్ జామ్కు కారణం.

మద్యం మత్తులో డివైడర్పై నుంచి వచ్చి ఎదురుగా వస్తున్న వాహనాలను కారు ఢీ కొట్టింది. ఒక కారు, 2 రెండు బైకులను కారు ఢీ కొట్టింది. పలువురికి గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు. రోడ్డుపై నానా బీభత్సం సృష్టించిన కారులో మద్యం బాటిల్స్ లభ్యమయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో ఉన్న సంపూర్ణ హోటల్‌ ఎదురుగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

హైదరాబాద్ సిటీ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికుల బాధ వర్ణనాతీతం. అసలే ఎండా కాలం, ఉక్కపోత. బస్సు కదిలితేనే గాలొచ్చే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో హైవేలపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోతే ఆ బాధలు మాటల్లో చెప్పలేం. ఓఆర్‌ఆర్‌ దగ్గర నుంచి కొత్తగూడెం వరకు హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోవడం గమనార్హం. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు స్పాట్కు చేరుకుని ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.