తిరుమల ఘాట్ రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. మొదటి ఘాట్ రోడ్డులోని 19వ టర్నింగ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి రక్షణ గోడను డీజీకొట్టి కొండపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులోని నలుగురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. స్వామివారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్వల్ప గాయాలు మినహా ప్రాణ నష్టం సంభవించకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఇదే ఘాట్ రోడ్డులో టెంపో బోల్తా పడి మరో ప్రమాదం జరిగింది