చేవెళ్లలో కారు బీభత్సం.. 2 కార్లు, 15 బైకులు ధ్వంసం

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కారు బీభత్సం సృష్టించింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్‭కు ఫిట్స్ రావడంతో కారు అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. సుమారు 20 బైకులను ఢీ కొట్టి.. కార్లను తొక్కుకుంటూ వెళ్లింది. కారు బీభత్సానికి బైకులను నడిరోడ్డుపై వదిలేసి వాహనదారులు పరుగులు తీశారు. ఏం జరిగిందో అర్థం కాక అంతా అయోమయంలో పడ్డారు. కారులోని వ్యక్తిని పట్టుకుని కొట్టడానికి ఆవేశంగా వచ్చిన బైకర్స్..  ఫిట్స్‭తో కొట్టుకుంటున్న  డ్రైవర్‭ను చూసి షాక్ అయ్యారు. వెంటనే మానవత్వం చూపించి అతడికి చికిత్స అందించారు. ప్రమాద సంఘటనతో ఆ ప్రాంతమంతా బీభత్సంగా మారింది. అయితే.. ప్రమాదంలో దెబ్బతిన్న బైకులకు నష్టపరిహారం ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇది కావాలని చేసింది కాదని ఫిట్స్ రావడం వల్లే ఇలా జరిగిందని కారు ఓనర్ చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.