ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచలో కారు బీభత్సం సృష్టించింది. గురువారం (అక్టోబర్ 17) ఉదయం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులపైకి కారు వేగంగా దూసుకెళ్లి ఢీకొట్టిం ది.ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్సకోసం ఖమ్మం తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా..చికిత్స పొందుతూ మంచాల నర్సయ్య అనే వృద్ధుడు మృతిచెందాడు.
అతివేగంతో దూసుకొచ్చిన కారు..రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఏడుగురిని ఢీకొట్టింది అనంతరం ఓ చెట్టును ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జు అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.